వంగవీటి రాధాకృష్ణ వివాహ వేడుకకు హాజరైన పవన్ కళ్యాణ్..!!

ఆదివారం రాత్రి విజయవాడ పోరంకి లోని మురళి రిసార్ట్స్ లో మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ( Vangaveeti Radhakrishna ) వివాహ కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా నూతన వధూవరులు వంగవీటి రాధాకృష్ణ, పుష్పవల్లిలకు చాలామంది రాజకీయ నేతలు సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలియజేశారు.

 Pawan Kalyan Attended Vangaveeti Radhakrishna Wedding Ceremony Details, Pawan Ka-TeluguStop.com

ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) హాజరయ్యారు.పవన్ కళ్యాణ్ తో పాటు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్( Nadendla Manohar ) కూడా రావడం జరిగింది.

ఈ సందర్భంగా నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.గత నెల మూడవ తారీకు నరసాపురంకి చెందిన జక్కం బాబ్జి కుమార్తె పుష్పవల్లితో( Pushpavalli ) రాధా నిశ్చితార్థం జరిగింది.

నరసాపురం మున్సిపల్ మాజీ చైర్మన్.అమ్మని బాబ్జి దంపతుల రెండో కుమార్తె పుష్పవల్లి.నరసాపురంలో నిశ్చితార్థ కార్యక్రమం కేవలం కుటుంబ సభ్యులు బంధుమిత్రుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది.కాగా ఆదివారం రాత్రి జరిగిన వివాహ వేడుక. చాలా ఘనంగా నిర్వహించారు.వంగవీటి రాధా ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో( TDP ) రాణిస్తున్నారు.

అంతకుముందు 2014 ఎన్నికలలో వైసీపీలో( YCP ) ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.అనంతరం సరిగ్గా 2019 ఎన్నికలకు ముందు వైసీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది.

ఈ క్రమంలో రాబోయే ఎన్నికలలో వంగవీటి రాధ మరోసారి ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube