నేను నటించిన సినిమాలలో చరణ్ ఆ సినిమా చేస్తే చూడాలని ఉంది....మనసులో కోరిక చెప్పిన చిరంజీవి!

తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటుడు చిరంజీవి ( Chiranjeevi ) ఒకరు.ఒక సాధారణ కానిస్టేబుల్ కుమారుడిగా ఇండస్ట్రీలోకి వచ్చినటువంటి ఈయన మెగాస్టార్ గా గుర్తింపు సంపాదించుకున్నారు.

 Chiranjeevi Latest Comments Viral On Social Media, Chiranjeevi, Ram Charan, Jaga-TeluguStop.com

చిరంజీవి ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఎంతోమందికి ఈయన స్ఫూర్తిగా నిలిచి సినీ బ్యాగ్రౌండ్ లేకపోయినా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇండస్ట్రీలో సక్సెస్ అయినటువంటి హీరోలు కూడా ఉన్నారు.ఇలా చిరంజీవి ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారనే చెప్పాలి.

ఇలా తన సినీ కెరియర్ లో దాదాపు 150 కి పైగా సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి చిరంజీవి ఇప్పటికీ వరుస సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు.ఇకపోతే చిరంజీవి తన సినీ కెరియర్లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు ఉన్నాయనే సంగతి మనకు తెలిసిందే .ఈ క్రమంలోనే చిరంజీవి వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినటువంటి రామ్ చరణ్ తండ్రికి తగ్గ తనయుడు అనే పేరు కూడా సంపాదించుకున్నారు అయితే చిరంజీవి నటించినటువంటి బ్లాక్ బస్టర్ సినిమాలలో తన కొడుకు కనుక ఏదైనా సినిమా చేయాల్సి వస్తే ఏ సినిమా చేస్తే బాగుంటుంది అన్న ప్రశ్న చిరంజీవికి ఒక సందర్భంలో ఎదురైంది.

ఈ ప్రశ్నకు చిరంజీవి సమాధానం చెబుతూ తన మనసులో ఉన్న కోరికను బయటపెట్టారు.తాను నటించిన సినిమాలలో కనుక రామ్ చరణ్ ( Ram Charan ) నటించాల్సి వస్తే తప్పకుండా జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాలో నటించాలని నేను కోరుకుంటాను అంటూ చిరంజీవి తెలియజేశారు.మరి మీరు నటించిన ఈ సినిమాలో చరణ్ నటిస్తే హీరోయిన్ గా ఎవరు నటిస్తే బాగుంటుందని మీరు అభిప్రాయపడుతున్నారు అనే ప్రశ్న కూడా చిరంజీవికి ఎదురయింది.

ఈ ప్రశ్నకి చిరంజీవి సమాధానం చెబుతూ శ్రీదేవి కూతురు ఉంది కదా ఆ అమ్మాయి హీరోయిన్గా నటిస్తే బాగుంటుంది అంటూ ఈ సందర్భంగా చిరంజీవి తన కుమారుడిని జగదేకవీరుడు అతిలోకసుందరి ( Jagadeka veerudu Athiloka Sundari ) సినిమాలో చూడాలనుకుంటున్నారని చెప్పకనే చెప్పేశారు.

ప్రస్తుతం రామ్ చరణ్ ప్రస్తుతం వరస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.మరి తన తండ్రి కోరుకున్న విధంగానే ఈయన నటి జాన్వీ కపూర్ ( Janvee Kapoor ) తో కలిసి జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాలో నటిస్తారా ఆ అవకాశం వస్తుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది.ఇక ఈ సినిమాలో చరణ్ నటిస్తే మరో బ్లాక్ బస్టర్ కూడా ఖాయమేనని చెప్పాల్సిన పనిలేదు.

ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఈయన శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ అనే సినిమాలో నటిస్తున్నారు.ఈ సినిమా తర్వాత తన తదుపరి చిత్రం బుచ్చిబాబు దర్శకత్వంలో చేయబోతున్న సంగతి తెలిసిందే.

https://www.facebook.com/watch/?extid=WA-UNK-UNK-UNK-AN_GK0T-GK1C&mibextid=5SVze0&v=586806979523264
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube