ప్రపంచ కప్ ఆడే 10 జట్లలో సెమీఫైనల్ చేరే నాలుగు జట్లు ఇవే..!

ప్రపంచ కప్ ( World Cup )లో అన్ని జట్లు నాలుగు మ్యాచులు పూర్తి చేసుకున్నాయి.ఈ టోర్నీలో ఓటమి ఎరగని న్యూజిలాండ్, భారత్( New Zealand, India ) జట్లు నాలుగు వరుస విజయాలతో 8 పాయింట్లతో ఉన్నాయి.

 Out Of The 10 Teams Playing In The World Cup, These Are The Four Teams That Will-TeluguStop.com

రన్ రేట్ కారణంగా న్యూజిలాండ్ తొలి స్థానంలో, భారత్ రెండవ స్థానంలో ఉన్నాయి.ఈ రెండు జట్లు సెమీఫైనల్ చేరడం దాదాపుగా ఖరారు అయినట్టే.

లీగ్ దశలో భారత్ నేడు జరిగే న్యూజిలాండ్ మ్యాచ్ తో పాటు ఇంగ్లాండ్, శ్రీలంక, సౌత్ ఆఫ్రికా, నెదర్లాండ్స్( England, Sri Lanka, South Africa, Netherlands ) జట్లతో మ్యాచ్లు ఆడాల్సి ఉంది.ఈ జట్లలో సౌత్ ఆఫ్రికా జట్టు మాత్రమే భారత్ కు గట్టి పోటీ ఇవ్వగలుగుతుంది.

మిగతా జట్లపై భారత్ పై చేయి సాధించే అవకాశం ఉంది.కాబట్టి సౌత్ ఆఫ్రికా చేతిలో భారత్ ఓడిన పెద్ద నష్టం ఉండదు.

లీగ్ దశలో మిగిలి ఉన్న మ్యాచులలో రెండు మ్యాచ్లలో గెలిచిన భారత్ సెమీఫైనల్స్ అవకాశాలు సజీవంగానే ఉంటాయి.

Telugu England, India, Netherlands, Zealand, Africa, Sri Lanka, Cup-Sports News

న్యూజిలాండ్ జట్టు విషయానికి వస్తే.ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, పాకిస్తాన్, శ్రీలంక జట్లతో ఆడాల్సి ఉంది.కనీసం లీగ్ దశలో మిగిలి ఉన్న మ్యాచులలో రెండు మ్యాచ్లలో గెలిచిన సెమీఫైనల్ చేరుతుంది.

ఇక సెమీ ఫైనల్ చేరే మిగతా రెండు జట్ల విషయానికి వస్తే.దక్షిణాఫ్రికా తో పాటు ఆస్ట్రేలియా సెమీఫైనల్ చేరుతాయనే అంచనాలు ఉన్నాయి.దక్షిణాఫ్రికా జట్టు ఈ లీగ్ లో ఇంకా బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్, భారత్, ఆఫ్ఘనిస్తాన్ లతో ఆడాల్సి ఉంది.రన్ రేట్ మెరుగ్గా ఉంది కాబట్టి మరో రెండు మ్యాచ్లలో విజయం సాధిస్తే సెమీఫైనల్ చేరుతుంది.

Telugu England, India, Netherlands, Zealand, Africa, Sri Lanka, Cup-Sports News

ఆస్ట్రేలియా జట్టు ఇంకా నెదర్లాండ్స్, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, ఆఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్ జట్లతో తలపడాల్సి ఉంది.కచ్చితంగా మూడు మ్యాచ్లలో గెలిస్తేనే సెమీస్ చేరుతుంది.ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఇంగ్లాండ్ మరియు పాకిస్తాన్ జట్లు సెమీస్ చేరలేవు.ఈ రెండు జట్ల ఆట తీరు చాలా దారుణంగా ఉంది.ఈ జట్లు సెమీస్ చేరాలంటే.మిగిలి ఉన్న అన్ని మ్యాచ్లలో కచ్చితంగా గెలవాల్సిందే.

ఇక నెదర్లాండ్స్, బంగ్లాదేశ్, ఆఫ్గనిస్తాన్, శ్రీలంక జట్లు ఆడిన నాలుగు మ్యాచ్లలో మూడు మ్యాచ్లలో ఓటమిని చవిచూశాయి.కాబట్టి ఇప్పటికే ఈ జట్లు సెమీ ఫైనల్ చేరే అవకాశాలను కోల్పోయాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube