ఈ ముగ్గురి లెజెండరీ యాక్టర్స్ పేరుతో సినిమాలు చేసిన మాస్ రాజా.. ఏ సినిమాలో తెలుసా?

మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎందరో లెజెండరీ నటులు ఉన్నారు.వారు పరిశ్రమకు చేసిన కృషి ఇప్పటికి చెప్పుకుంటూనే ఉంటున్నాం.

 Ravi Teja Movies With The Names Of Those Three Legendary Tollywood Actors, Ravi-TeluguStop.com

మరి మన టాలీవుడ్ లెజెండరీ నటులలో విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు, నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు, సూపర్ స్టార్ కృష్ణ గారు ఉన్నారు.ఈ ముగ్గురు కూడా తెలుగులో వందలాది సినిమాలను చేసి తెలుగు చిత్రసీమకు మరింత గుర్తింపు లభించేలా చేసారు.

వీరంతా ఇప్పటికి తెలుగు ప్రేక్షకుల చేత కీర్తింపబడుతున్నారు.వీరు భౌతికంగా మన మధ్య లేకపోయినా ప్రేక్షకుల హృదయాల్లో ఇప్పటికి ఉన్నారు.

మరి అలాంటి ముగ్గురు లెజెండరీ నటుల పేర్లతో మాస్ మహారాజ రవితేజ( Ravi Teja ) సినిమాలు చేశారు.

వీరి పేర్లను టైటిల్స్ గా తీసుకుని రవితేజ సినిమాలు చేసారు. రామారావు ఆన్ డ్యూటీ, కృష్ణ, టైగర్ నాగేశ్వరరావు.ఇలా మూడు సినిమాలు చేయగా అందులో రామారావు ఆన్ డ్యూటీ ప్లాప్ అయ్యింది.

కృష్ణ సూపర్ హిట్ గా నిలిచింది.ఇక తాజాగా ఈ దసరా పండుగకు టైగర్ నాగేశ్వరరావు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

టైగర్ నాగేశ్వరరావు ( Tiger Nageswara Rao ) బయోపిక్ గా తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 20న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.నూతన డైరెక్టర్ వంశీ( Director Vamsee ) దర్శకత్వంలో భారీ స్థాయిలో తెరకెక్కిన ఈ సినిమాతో రవితేజ మొదటిసారి పాన్ ఇండియన్ సినిమా చేసాడు.గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.ఈ సినిమాలో రవితేజ సరసన నుపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్(Nupur Sanon , Gayatri Bharadwaj ) హీరోయిన్స్ గా నటించారు.

అలాగే జివి ప్రకాష్ కుమార్ స్వరాలు అందించగా లాంగ్ రన్ లో ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube