Payal Rajputh : ఇది నా కమ్ బ్యాక్.. ఆ మూవీపై అతిగా ఆశలు పెట్టుకున్న పాయల్.. చివరికి?

తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ పాయల్ రాజపుత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.పాయల్ రాజ్ పుత్ ( Payal rajputh ) పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చే సినిమా ఆర్ఎక్స్ 100.

 Payal Rajput Latest Comments About Her Career-TeluguStop.com

( RX 100 ) అజయ్ భూపతి( Ajay Bhupathi ) దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది.ముఖ్యంగా ఈ సినిమాలోని పాటలు యూట్యూబ్ లో సంచలనం సృష్టించాయి.

ఇకపోతే అజయ్ భూపతి హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ కాంబినేషన్ లో తెరకెక్కిన మరో సినిమా మంగళవారం.త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Telugu Ajay Bhupathi, Career, Latest, Mangalavaaram, Nandita Swetha, Payal Rajpu

సస్పెన్స్‌, క్రైమ్‌ కథా చిత్రంగా దీనిని తీర్చిదిద్దారు.తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది.ఈ వేడుకలో పాల్గొన్న అజయ్‌భూపతి, పాయల్‌ రాజ్‌పుత్‌, నందితా శ్వేత పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో భాగంగా పాయల్ రాజ్ పుత్ మాట్లాడుతూ.

ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను.కాస్త కంగారుగా కూడా ఉంది.

నేడు నా జీవితంలో ఎంతో ముఖ్యమైన రోజు. మంగళవారం ట్రైలర్‌ విడుదలైంది.

మా చిత్రానికి వస్తోన్న బజ్‌ చూసి ఆనందంతో మాటలు రావడం లేదు.నిజం చెప్పాలంటే, కొంతకాలం క్రితం వరకూ కెరీర్‌ విషయంలో గందరగోళంలో ఉన్నాను.

Telugu Ajay Bhupathi, Career, Latest, Mangalavaaram, Nandita Swetha, Payal Rajpu

ఎవరితో మాట్లాడాలో, ఎవరి సాయం తీసుకోవాలో అర్థం కాలేదు.కానీ, నేను ఆశలు వదులుకోలేదు.కట్‌ చేస్తే.మంగళవారం మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను.ఈ చిత్రాన్ని ఒక వరంలా భావిస్తున్నాను.2018లో ఆర్‌ఎక్స్‌ 100 సినిమాతో( RX 100 ) అజయ్‌ భూపతి నన్ను వెండితెరకు పరిచయం చేశారు.ఆ చిత్రం నా కెరీర్‌నే మార్చేసింది.గడిచిన ఏడాది నుంచి మంగళవారం సినిమాకోసమే వర్క్‌ చేస్తున్నాను తెలుగు చిత్ర పరిశ్రమలోకి కమ్‌బ్యాక్‌ అవుతున్నట్లు ఉంది అని పాయల్‌ రాజ్ పుత్ తెలిపారు.

ఈ సందర్భంగా పాయల్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో మంగళవారం సినిమాపై ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నట్టు ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఈ సినిమా కనుక ఫ్లాప్ అయితే పాయల్ కెరియర్ ముగిసినట్లే అంటూ కామెంట్ చేస్తున్నారు.

మరి ఈ సినిమా పాయల్ కెరీర్ ను నిలబెడుతుందా లేదా ఏం చేస్తుందో చూడాలి మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube