'టైగర్ నాగేశ్వర రావు' మొదటి రోజు వసూళ్లు ఇంత తక్కువ రావడానికి కారణం అదేనా!

లార్జ్ స్కేల్ లో సినిమాలు తీస్తే కచ్చితంగా ఆడియన్స్ ప్రోత్సహిస్తారు.హీరో ఎవరు అనేది కూడా చూడరు అనే విషయం చాలా సార్లు రుజువు అయ్యింది.

 Is That The Reason Why Tiger Nageswara Rao's First Day Collections Are So Low ,-TeluguStop.com

ముక్కు మొహం తెలియని హీరోల సినిమాలకు కూడా మన టాలీవుడ్ ఆడియన్స్ బ్రహ్మరథం పట్టిన రోజులు ఉన్నాయి.కానీ ఒక్కోసారి పేరున్న హీరోలకు మంచి డీసెంట్ టాక్ వచ్చినా కూడా వసూళ్ల విషయం లో దారుణంగా విఫలం అవుతుంటాయి.

నిన్న విడుదలైన మాస్ మహారాజ రవితేజ( Ravi Teja ) నటించిన ‘టైగర్ నాగేశ్వర రావు’ ( Tiger Nageswara Rao )సినిమా కూడా అలాంటిదే.ఈ చిత్రం కి మొదటి ఆట నుండే పర్వాలేదు బాగుంది అనే రేంజ్ టాక్ వచ్చింది.

కానీ ఓపెనింగ్స్ మాత్రం లేవు.ఈ చిత్రానికి కచ్చితంగా 10 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు మొదటి రోజే వస్తాయని అనుకునేవారు.

సినిమాలోని ప్రమోషనల్ కంటెంట్ ఆ రేంజ్ లో పేలింది.

Telugu Nupur Sanon, Ravi Teja, Tigernageswara, Tollywood-Movie

కానీ ఒకేసారి మూడు సినిమాలు విడుదల అవ్వడం, ఆడియన్స్ కి చాలా ఛాయస్ లు ఉండడం వల్ల ఈ సినిమా టాక్ జనాల్లోకి బలంగా వెళ్ళలేదు.యూత్ ఆడియన్స్ మొత్తం విజయ్ హీరో గా నటించిన ‘లియో’( LEO ) చిత్రానికి వెళ్తున్నారు.ఇక ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం భగవంత్ కేసరి ( Bhagavanth Kesari )వైపు మొగ్గు చూపుతున్నారు.

ఈ రెండు సినిమాల మధ్య టైగర్ నాగేశ్వర రావు ని మర్చిపోయారు ప్రేక్షకులు.ఈ చిత్రానికి మొదటి రోజు కేవలం నాలుగు కోట్ల 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వసూళ్లు మాత్రమే వచ్చాయి.

ఈ సినిమాకి పెట్టిన బడ్జెట్ కి జరిగిన ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ కి ఇది చాలా తక్కువ.ఇతర భాషల్లో నుండి మంచి వసూళ్లు వస్తాయేమో అనుకున్నారు.

కానీ ఇతర భాషల్లో కనీస స్థాయి గ్రాస్ వసూళ్లను2 కూడా రాబట్టలేదు ఈ చిత్రం.

Telugu Nupur Sanon, Ravi Teja, Tigernageswara, Tollywood-Movie

ట్రేడ్ పండితులు అందిస్తున్న లెక్కల ప్రకారం ఈ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతాలు మరియు అన్నీ భాషలకు కలిపి సుమారుగా 37 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది.ఇప్పుడు ఈ సినిమాకి వస్తున్న వసూళ్లు చూస్తూ ఉంటే ఫుల్ రన్ లో 15 కోట్లు కూడా దాటేలాగా కనిపించడం లేదు.ఫలితంగా నిర్మాతలు 50 శాతం కి నష్టాలను చూసే పరిస్థితి ఏర్పడింది.

రవితేజ కెరీర్ లో ల్యాండ్ మార్కుగా నిలుస్తుంది అనుకున్న ఈ సినిమా ఇప్పుడు ఆయన కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ వైపు పరుగులు తీసే దిశగా పోతుంది అంటే రవితేజ ( Ravi Teja )బ్యాడ్ లక్ అనే చెప్పాలి.అయితే మంగళవారం వరకు దసరా సెలవలు ఉండడం తో టాక్ ఇంప్రూవ్ అయ్యి వసూళ్లు పెరుగుతుందేమో అనే ఆశతో ఉన్నారు మేకర్స్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube