కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్( Lokesh Kanagaraj ) దర్శకత్వంలో విజయ్( Vijay ) దళపతి హీరోగా నటించిన తాజా చిత్రం లియో( Leo ) .సినిమా ఎన్నో అంచనాల నడుమ అక్టోబర్ 19వ తేదీన స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది అయితే కోలీవుడ్ ఇండస్ట్రీలో ఈ సినిమాకు మంచి ఆదరణ వచ్చినప్పటికీ తెలుగులో మాత్రం ఈ సినిమాకు అనుకున్న స్థాయిలో ఆదరణ రాలేదని చెప్పాలి.
ఈ సినిమాని అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా నిర్మాత లలిత్ కుమార్ నిర్మించారు.ఇక ఈ సినిమా గురించి పలుచోట్ల మిశ్రమ స్పందన లభిస్తుంది.
ఈ క్రమంలోనే నిర్మాత లలిత్ కుమార్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఈ సినిమా గురించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ సందర్భంగా లలిత్ కుమార్ మాట్లాడుతూ మేము లియో సినిమాని 1000 కోట్లు సాధిస్తుంది అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని సినిమా చేయలేదని తెలియజేశారు.ఒక మంచి సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలన్న తపనతోనే ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చామని అయితే ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో తమకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు.ఇక తమిళనాడులో ఉదయం నాలుగు గంటలకే షో వేయకపోవడంతో చాలామంది వేరే రాష్ట్రాలకు వెళ్లి ఈ సినిమాని చూస్తున్నారని లలిత్ కుమార్( Lalit Kumar ) వెల్లడించారు.

ఈ విధంగా బెనిఫిట్ షోలో వేయకపోవడం వల్ల సుమారు రెండు లక్షల మంది వరకు ఇతర రాష్ట్రాలకు వెళ్లి ఈ సినిమాని చూశారని నిర్మాత వెల్లడించారు.ఇక ఈ సినిమా హిందీ మార్కెట్ నుంచి కూడా మేము పెద్దగా ఆశించలేదు.అందుకే ఈ సినిమా వెయ్యి కోట్లు కలెక్షన్స్ రాబడుతుంది అని మేము అసలు అంచనా వేయలేదని అలాంటి ఆలోచనలు కూడా చేయలేదని తెలిపారు.ఇక బెనిఫిట్ షో ల కోసం కోర్టుకు వెళ్దామని ప్రయత్నాలు చేసిన విజయ్ అంతా అవసరం ఏముంది ప్రశాంతమైన వాతావరణంలో మన సినిమాని విడుదల చేయాలని చెప్పారని లలిత్ కుమార్ వెల్లడించారు.
ఇక మా సినిమా చూసి రజనీకాంత్ లాంటి స్టార్ హీరోలు కూడా ఫోన్లు చేసే సినిమా అద్భుతంగా ఉంది అని చెప్పడం చాలా సంతోషంగా అనిపిస్తుందని ఈ సందర్భంగా ఈయన చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.







