గ్రాడ్యుయేషన్ విద్యార్ధులు, అందుబాటులో వున్న హెచ్1బీ వీసాల( H1B visas ) మధ్య భారీ అంతరం వుందని పేర్కొంటూ.విదేశీ విద్యార్ధుల ‘‘ Optional Practical Training (OPT) ’’ ప్రోగ్రామ్‌లో మార్పులు చేయాలని అమెరికాలోని ప్రవాస భారతీయ సంఘం శుక్రవారం బైడెన్ అడ్మినిస్ట్రేషన్‌ను కోరింది.
ఫాండేషన్ ఫర్ ఇండియా అండ్ ఇండియన్ డయాస్పోరా స్టడీస్ (ఎఫ్ఐఐడీఎస్).ఈ మేరకు హోంలాండ్ సెక్యూరిటీ సెక్రటరీ అలెజాండ్రో మయోర్కాస్‌కు లేఖ రాశారు.
ఈ గ్యాప్ కారణంగా భారతీయ విద్యార్ధులు యూఎస్ పరిశ్రమలో భాగం కాలేకపోతున్నారని సంస్థ ఆవేదన వ్యక్తం చేసింది.
సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ (STEM) రంగాలలో డిగ్రీలు వున్న అర్హత గల విద్యార్ధులకు STEM ఓపీటీ వ్యవధిని 24 నెలల నుంచి 48 నెలలకు పొడిగించడం, ఓపీటీ పోస్ట్‌కి దరఖాస్తు చేసుకునే వ్యవధిని 60 రోజుల నుంచి 180 డిగ్రీలకు పొడిగించడం, STEM డిగ్రీ హోల్డర్‌లకు STEM డిగ్రీయేతర హోల్డర్‌లతో పోలీస్ హెచ్1 బీ వీసా లాటరీలో ఎంపికయ్యే అవకాశాలను ఆరు రెట్లు పెంచడం వంటి సూచనలను ఎఫ్ఐఐడీఎస్ చేసింది.
ఇలా చేయడం ద్వారా తమ ఆవిష్కరణలకు తోడ్పాటును అందించే ప్రతిభను నిలుపుకోవడంతో పాటు ఈ విద్యార్ధులు అమెరికాకు తీసుకొచ్చే ఆర్ధిక ప్రయోజనాలను కూడా పరిగణనలోనికి తీసుకోవాలని ఎఫ్ఐఐడీఎస్ పాలసీ అండ్ స్ట్రాటజీ చీఫ్ ఖండేరావ్ కాంద్ ( Khanderao Cond )లేఖలో పేర్కొన్నారు.

గ్లోబల్ టెక్నాలజీ అభివృద్ధి, కృత్రిమ మేథ, సైబర్ భద్రతలో పెరుగుతున్న సవాళ్లను దృష్టిలో వుంచుకుని అమెరికాలో STEM ప్రతిభను నిలుపుకోవడం అనేది ఆర్ధికపరమైన ఆవశ్యకత మాత్రమే కాదు.జాతీయ భద్రతకు సంబంధించినదని కాండ్ లేఖలో సూచించారు.సాంకేతిక రంగంలో ప్రతిభావంతుల లోటును జాతీయ భద్రతా సంస్థ (ఎన్ఎస్ఏ) సైతం జాతీయ భద్రతకు ముప్పుగా పేర్కొన్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు.
ఓపీటీ వ్యవధిని పొడిగించడం ద్వారా అదనపు హెచ్ 1 బీ వీసా కేటాయింపులను అందించడం , లాటరీ అవకాశాలను పెంచడం ద్వారా ప్రతిభను నిలుపుకోవచ్చని కాండ్ సూచించారు.

ఈ చొరవ గణనీయమైన ఆర్ధిక ప్రభావాన్ని చూపుతుందని పేర్కొంటూ.విదేశీ విద్యార్ధులు యూఎస్ ఆర్ధిక వ్యవస్ధకు సహకరిస్తున్నారని కాండ్ చెప్పారు.దేశంలోని విశ్వవిద్యాలయాలకు ఫీజులు, ఖర్చుల పరంగా దాదాపు 10 బిలియన్ యూఎస్ డాలర్లను అందిస్తున్నారని ఆయన గుర్తుచేశారు.
అమెరికాలో అనిశ్చితి కారణంగా విద్యార్ధులు కెనడా, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సహా ఇతర దేశాల వైపు వెళ్లే పరిస్ధితి తలెత్తుతుందని ఇది అమెరికన్ విశ్వవిద్యాలయాలు, ఆర్ధిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుందని కాండ్ హెచ్చరించారు.







