కాంగ్రెస్ అగ్రనేతలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.తెలంగాణకు కాంగ్రెస్ తీరని అన్యాయం చేసిందని ఆమె ఆరోపించారు.
రాహుల్ గాంధీ కాదన్న ఎమ్మెల్సీ కవిత ఎన్నికల గాంధీ అంటూ విమర్శించారు.ఎన్నికల సమయంలోనే రాహుల్ గాంధీ వస్తారని చెప్పారు.
తెలంగాణకు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీతో పాటు సోనియా గాంధీ అన్యాయం చేశారని తీవ్ర ఆరోపణలు చేశారు.ఆంధ్రా హక్కుల గురించి మాట్లాడిన సోనియా గాంధీ తెలంగాణ గురించి మాత్రం మాట్లాడలేదని మండిపడ్డారు.







