వచ్చే నెలలో సరిగ్గా ఇదే సమయానికి తెలంగాణాలో ఎన్నికల వాతావరణం తార స్థాయిలో ఉంటుంది.నవంబర్ 30 వ తేదీన సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్న సందర్భం లో ఏ పార్టీ కి ఎన్ని స్థానాలు వస్తాయి అనే దానిపై రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చలు మరియు బెట్టింగులు ఇప్పటి నుండే ప్రారంభం అయ్యాయి.
కొంతమంది బీఆర్ఎస్ పార్టీ ( BRS party )మరోసారి అధికారం లోకి వస్తుంది అంటుంటే, మరికొంతమంది కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని అంటున్నారు.గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ మరియు ఉపఎన్నికలలో సత్తా చాటిన బీజేపీ పార్టీ మాత్రం అసలు రేస్ లోనే లేదని అంటున్నారు.
ఎప్పుడైతే బండీ సంజయ్ చేతుల్లో నుండి కిషన్ రెడ్డి చేతికి పార్టీ చేరిందో, అప్పటి నుండే బీజేపీ పార్టీ తెలంగాణ లో భూస్థాపితం అయిపోయిందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.ఇకపోతే రీసెంట్ గా ఇండియా టుడే ఒక సర్వే నిర్వహించింది.

ఈ సర్వే పూర్తిగా కాంగ్రెస్ పార్టీ( Congress party ) కి అనుకూలంగా వచ్చింది.జరగబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కి 54 స్థానాలు వస్తాయని, బీఆర్ఎస్ పార్టీ కి 49 స్థానాలు అలాగే బీజేపీ పార్టీ కి 8 స్థనాలు వస్తాయని ఈ సర్వే లో తేలింది.మిగిలిన స్థానాల్లో ఇతరు గెలుస్తారట.కేవలం ఈ ఒక్క సర్వే నే కాదు, అనేక సర్వేల ఫలితాలలో బీఆర్ఎస్ పార్టీ కి ఈసారి గెలుపు అంత సులభం కాదని తెలుస్తుంది.
అభివృద్ధి విషయం లో ముందంజ లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ సంక్షేమ పథకాల్లో మాత్రం వెనుకబడిందని.అందుకే కాంగ్రెస్ పార్టీ వైపు అనుకూల పవనాలు వీస్తున్నాయని చెప్పుకొస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.
ముఖ్యంగా పెన్షన్ స్కీం విషయం లో బీఆర్ఎస్ పార్టీ తీవ్రమైన వ్యతిరేకతని ఎదురుకుంది.ఇదే ఆ పార్టీ గ్రాఫ్ డౌన్ అవ్వడానికి కారణం అని అంటున్నారు విశ్లేషకులు.

ఇకపోతే మరోపక్క జనసేన మరియు టీడీపీ ( Janasena ,TDP )పార్టీలు కూడా తెలంగాణ ఎన్నికలలో పోటీ చేస్తున్నాం అని అధికారిక ప్రకటన చేసారు.రీసెంట్ గానే బీజేపీ పార్టీ నేత కిషన్ రెడ్డి పవన్ కళ్యాణ్ ని కలిసి , ఉమ్మడిగా పోటీ చేసే దానిపై చర్చలు జరిపారు.బీజేపీ – జనసేన కలిసి ఎన్నికలలో వెళ్లబోతుందా?, వీళ్ళతో పాటు టీడీపీ కూడా కలిసి వస్తుందా అనేది రాబోయే రోజుల్లో క్లారిటీ రానుంది.ఉమ్మడి గా పోటీ చేస్తే బీజేపీ కి మెరుగైన ఫలితాలు రావొచ్చని ఈ సర్వే లో తేలింది.
ఒకవేళ బీఆర్ఎస్ మెజారిటీ సీట్లు రాకపోతే MIM పార్టీ తో ఎన్నికల తర్వాత పొత్తు పెట్టుకునే అవకాశం ఉంది.గతం లో ఎన్నో సార్లు ఇది జరిగింది కూడా.







