బీజేపీ తొలి జాబితా నేడే ! కెసిఆర్ పై పోటీ చేసేది ఎవరంటే ? 

చాలా రోజులకు ఎదురుచూస్తున్న బీజేపీ అసెంబ్లీ అభ్యర్థుల జాబితా నేడు విడుదల కానుంది.  మొదటి విడతల 55 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్నారు.

 Bjp's First List Is Today! Who Will Compete Against Kcr , Telangana Bjp, Telan-TeluguStop.com

టిఆర్ఎస్ సం పార్టీ అభ్యర్థులను ప్రకటించగా, కాంగ్రెస్ సైతం 55 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది .ఈరోజు బిజెపి తొలి జాబితా కూడా విడుదల కాబోతోంది.చాలా రోజులుగా దీనికి సంబంధించిన కసరత్తు జరుగుతుంది.తొలి విడత 55 మంది అభ్యర్థులతో కూడిన జాబితాకు కేంద్ర ఎన్నికల ప్రచార కమిటీ ఆమోదం తెలిపింది.ప్రధాని నరేంద్ర మోది అధ్యక్షతన ఢిల్లీలోని పార్టీ జాతీయ కార్యాలయంలో కేంద్ర ఎన్నికల కమిటీ నిన్న రాత్రి సమావేశం అయింది .ఈ సమావేశంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ( Amith sha ) పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా , జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ తో పాటు,  కమిటీ సభ్యులైన తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కిషన్  రెడ్డి , ఓబిసి మోర్చ జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్,  పార్టీ ఇన్చార్జీలు తరుణ్ చుగ్ , సునీల్ బన్సాల్ , ఈటెల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

Telugu Amith Sha, Bjpmla, Brs, Congress, Kishan Reddy, Modhi, Telangana Bjp, Tel

ఈ సందర్భంగా జాబితాలోని 55 మంది అభ్యర్థులకు ఆమోదం తెలిపారు.ఈ జాబితాను ఈరోజు అధికారికంగా బిజెపి ప్రకటించనుంది.పార్టీ కీలక నేత ,  హుజురాబాద్ బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ను ప్రస్తుతం ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూరాబాద్ తో పాటు,  కేసీఆర్( KCR ) పోటీ చేస్తున్న గజ్వేల్ నుంచి పోటీకి దింపాలని నిర్ణయించారట.ఇక తెలంగాణలో బిజెపికి నలుగురు ఎంపీలు ఉండగా,  ముగ్గురిని శాసనసభ ఎన్నికల్లో పోటీకి దింపాలని బిజెపి జాతీయ నాయకత్వం నిర్ణయించిందట.

Telugu Amith Sha, Bjpmla, Brs, Congress, Kishan Reddy, Modhi, Telangana Bjp, Tel

 కరీంనగర్ ఎంపీ , బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్( Bandi Sanjay ) నూ కరీంనగర్ నుంచి,  ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు ను బోథ్ నియోజకవర్గం నుంచి, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ను కరీంనగర్ జిల్లా కోరుట్ల నుంచి పోటీ చేయించాలని నిర్ణయించారు.అలాగే మాజీ ఎంపీ వివేక్ ను చెన్నూరు నుంచి,  పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ గద్వాల నుంచి పోటీకి దింపుతున్నారట .అలాగే దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ను మరోసారి అదే నియోజకవర్గంలో నుంచి పోటీ కి దించుతున్నారట.ఇక గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సస్పెన్షన్ ఎత్తివేత పైన ఈ సమావేశంలో చర్చించారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube