ఇరగదీస్తున్న రోహిత్ శర్మ... ఏకంగా 4 ప్రపంచ రికార్డులు నమోదు!

అవును, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ( Rohit Sharma ) మరోసారి ఇరగదీశాడు. భారత్, బంగ్లాదేశ్ ( India , Bangladesh )మధ్య పుణె వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో రోహిత్ శర్మ తన విశ్వరూపం మరోసారి చూపించాడు.ఇంకేముంది, కట్ చేస్తే మనోడి దెబ్బకు రికార్డులు షేక్ అయ్యాయి.40 బాల్స్ ఆడిన రోహిత్ శర్మ 7 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 48 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.బరిలో రోహిత్ ఉన్నంతసేపూ బంగ్లా బౌలర్లతో చెడుగుడు ఆడుకున్నాడు.ఈ క్రమంలో ఓ ఫుల్ షాట్ ఆడే క్రమంలో బౌండరీ లైన్ వద్ద క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.

 Rohit Sharma Who Is Playing Registered 4 World Records Simultaneously , R-TeluguStop.com

హసన్ మహమూద్ వేసిన ఇన్నింగ్స్ 13వ ఓవర్లో ఓ భారీ సిక్సు కొట్టిన హిట్‌మ్యాన్.ఓ ఆ తర్వాత షార్ట్ పిచ్ డెలివరీకి ఫుల్‌షాట్‌కు ట్రై చేసి బౌండరీ లైన్ వద్ద దొరికిపోయాడు.

Telugu Asia Cup, Registered, Rohit Sharma, Simultaneously-Latest News - Telugu

ఇకపోతే ప్రపంచకప్‌లో( World Cup ) బంగ్లాతో ఆడిన 3 మ్యాచ్‌లలోనూ సెంచరీలు కొట్టిన రోహిత్.ఈ మ్యాచ్‌లోనూ మరో సెంచరీ కొడతాడని అందరూ ఆశపడ్డారు.కానీ భారీ షాట్‌కు యత్నించి.పెవిలియన్ చేరాడు.లేదంటే నాలుగో సెంచరీ చేసేవాడే.కాగా ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ అనేక రికార్డులు బ్రేక్ చేశాడు.

అంతర్జాతీయ క్రికెట్లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన కెప్టెన్‌గా హిట్‌మ్యాన్ చరిత్ర సృష్టించాడు అని చెప్పుకోవచ్చు.ఇంతకుముందు ప్లేయర్‌గా 78 సిక్సులు కొట్టిన రోహిత్ శర్మ.

( Rohit Sharma ).ఈ క్యాలెండర్ ఇయర్‌లో ఇండియా కెప్టెన్‍‌గా 61 సిక్సర్లు బాదాడు.అంతేకాకుండా వన్డే ప్రపంచకప్‌లో లక్ష్యఛేదనల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌‌గానూ రోహిత్ రికార్డు క్రియేట్ చేయడం విశేషం.

Telugu Asia Cup, Registered, Rohit Sharma, Simultaneously-Latest News - Telugu

అంతేకాకుండా ఈ మ్యాచ్‌లోనే ఆసియా గడ్డమీద జరిగిన వన్డే మ్యాచ్‌లలో 6 వేల పరుగులు పూర్తిచేసుకున్న బ్యాటర్‌గానూ రోహిత్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు.అదేవిధంగా మరోవైపు 2023 వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో హిట్‌మ్యాన్ అగ్రస్థానానికి చేరాడు.అవును, బంగ్లాతో మ్యాచ్‌లో 48 పరుగులు చేసిన రోహిత్ శర్మ.

( Rohit Sharma ).ఇప్పటి వరకూ 4 మ్యాచ్‌లు ఆడి ఏకంగా 253 పరుగులు చేశాడు.2019 ప్రపంచకప్‌లోనూ అత్యధిక పరుగులు చేసింది రోహిత్ శర్మే కావటం విశేషం.మరోవైపు వన్డే ప్రపంచకప్‌లలో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ల జాబితాలో రోహిత్ నాలుగో స్థానానికి చేరాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube