లక్ష్మీ కళ్యాణం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటి కాజల్ అగర్వాల్( Kajal Aggarwal ) .మొదటి సినిమాతోనే ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె అనంతరం చందమామ మగధీర వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాల ద్వారా పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేశారు.
ఇలా అతి తక్కువ సమయంలోనే తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి కాజల్ అగర్వాల్ అనంతరం తమిళ హిందీ సినిమా అవకాశాలను కూడా అందుకున్నారు.
ఇలా కెరియర్ పరంగా సౌత్ ఇండస్ట్రీతో పాటు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె కెరియర్ పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలోనే తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లు( Gautam Kitchlu ) అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు.వీరి వివాహం జరిగిన తర్వాత కరోనా రావడం సినిమా షూటింగ్లో ఆలస్యం కావడం అంతలోపే ఈమె ప్రెగ్నెంట్ కావడంతో దాదాపు రెండు సంవత్సరాల పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు.బాబుకు జన్మనిచ్చిన తరువాత కాజల్ అగర్వాల్ తిరిగి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు.
ఇక కాజల్ అగర్వాల్ తన సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస సినిమా అవకాశాలను అందుకొని ఎంతో బిజీగా ఉన్నారని చెప్పాలి.
వివాహాని కంటే ముందుగానే ఈమె కమల్ హాసన్ హీరోగా నటిస్తున్నటువంటి ఇండియన్ 2 సినిమాకు కమిట్ అయ్యారు.
అయితే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులలో పాల్గొని ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తి చేశారు అలాగే అనిల్ రావిపూడి బాలకృష్ణ కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన భగవంత్ కేసరి ( Bhagavanth Kesari )సినిమాలో కూడా ఈమె హీరోయిన్గా నటించారు.అదేవిధంగా సత్యభామ అనే మరొక సినిమా ద్వారా కూడా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.
సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి కాజల్ అగర్వాల్ భగవంత్ కేసరి సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇన్ని రోజులు తాను ఎంతో ఇబ్బంది పడుతున్నటువంటి ఒక సమస్య గురించి బయటపెట్టారు.ఇలా ఈ విషయం గురించి కాజల్ అగర్వాల్ మాట్లాడటంతో ఇన్ని రోజుల నుంచి కాజల్ ఇలాంటి సమస్యతో బాధపడుతున్నారా అంటూ అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు మరి ఈమెను వెంటాడుతున్నటువంటి ఆ సమస్య ఏంటి అనే విషయానికి వస్తే.
ఎంత డైట్ చేసినా.ఎన్ని వర్కౌట్స్ చేసినా.తన బాడీకి ఏం కాదట.ఫుడ్ తిన్న కూడా బరువు పెరగదట.ఒకవేళ తాను ఏవైనా పనుల్లో పడిపోయి మూడు రోజులు నాలుగు రోజులు జిమ్( Gym ) కి వెళ్ళకపోతే మాత్రం బీభత్సంగా బరువు పెరిగిపోతుందట.ఇలా పెరిగిన శరీర బరువు( Body Weight ) తగ్గించుకోవడం కోసం తిరిగి తాను నాలుగు రోజులపాటు జిమ్ లో భారీగా కష్టపడాల్సి వస్తుందంటూ ఈ సందర్భంగా కాజల్ తాను ఎదుర్కొంటున్నటువంటి వింత సమస్య గురించి మాట్లాడుతూ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
కాజల్ అగర్వాల్ ఇలాంటి వింత సమస్యతో బాధపడటం వల్లే తనకు ఎన్ని పనులు ఉన్న జిమ్ మాత్రం మానను అంటూ ఓపెన్ గానే చెప్పుకు వచ్చింది.ఇలా ఈమె తనకు ఉన్నటువంటి ఈ వింత సమస్య గురించి తెలియజేయడంతో ఇది కూడా ఒక సమస్యనా అంటూ ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు.
అయితే హీరోయిన్ కి ఫిట్నెస్ ఎంతో ముఖ్యం కనుక సెలబ్రిటీలకు ఇంత చిన్న సమస్యలు కూడా పెద్దవిగానే కనిపిస్తాయి అనడంలో సందేహం లేదు.