‘ ద్వీప ‘( Dweepa ) అనేది 2002లో నటి సౌందర్య తన ‘సత్య మూవీ మేకర్స్’ బ్యానర్‌పై నిర్మించిన కన్నడ చిత్రం.ఇది కన్నడ రచయిత నా డిసౌజా రాసిన నవల ఆధారంగా గిరీష్ కాసరవెల్లి( Girish Kasaravalli ) దర్శకత్వం వహించిన మూవీ.
ఆనకట్ట మునిగిపోయిన తర్వాత నలుగురు సీత అనే ద్వీపంలో చేరుకుంటారు.ఆ తర్వాత వారు ఎలా బతికారు, ఏం చేశారు అనేదే ఈ సినిమా కథ.నీటి మట్టం పెరిగినప్పటికీ, తమ పూర్వీకుల ఇంటిని, గ్రామాన్ని విడిచిపెట్టడానికి నిరాకరించిన భార్యాభర్తల పోరాట కథ ఇది.2002లో సౌందర్య ద్వీప నిర్మించినందుకు గాను ఉత్తమ నిర్మాతగా నేషనల్ ఫిలిం అవార్డును కూడా గెలుచుకుంది.ఈ మూవీ నిర్మించడమే కాక సౌందర్య ప్రధాన పాత్రలో నటించింది.

ఈ సినిమాలోని మగవారు ఆడవారి అభిప్రాయాలకు, కోరికలకు ప్రాధాన్యత ఇవ్వరనే డైలాగులు కూడా బాగా ఆలోచింపచేస్తాయి.చక్కగా బతికే ప్రజలను పునరావాసం పేరిట ఎలాంటి సౌకర్యాలు లేని ప్రాంతానికి తీసుకువెళ్లి పడేస్తే ఎంత బాధ ఉంటుంది? చక్కగా ఉన్న స్త్రీ( Women ) యొక్క హృదయాన్ని అనుమానాల ద్వారా గాయపరిచినంత బాధగా ఉంటుందన్నట్లు ఈ సినిమాలో చూపించారు.మహిళల మనసును ఈ సినిమా బాగా హైలెట్ చేసింది.
ప్రతి మగాడిని చాలా ప్రశ్నలు వేసింది.ఆమెను అపార్థాలతో ఎందుకు దూరం పెడతారు? ఆమెను ఒంటరి ద్వీపంగా ఎందుకు మారుస్తారు? కంటికి కనిపించని దేవుడిని నమ్మడం చాలా సులభం, కానీ పక్కన ఉన్న భార్యను నమ్మడం ఎందుకు కష్టం? ఆమె కృషికి కనీస గుర్తింపును ఎందుకు ఇవ్వరు? వంటి ప్రశ్నలన్నిటినీ ఈ సినిమా సినిమా చూసిన ప్రతి ఒక్కరిలో లేవనెత్తుతుంది.ఈ కథ ప్రకృతి వైపరీత్యాలను, స్త్రీల హృదయాలను ఒకే సమయంలో ప్రతిబింబిస్తుంది.

అందుకే ఈ సినిమా అసలైన ఫిమేల్ ఓరియంటెడ్ మూవీ( Female Oriented Movie ) అని చాలామంది విశ్లేషకులు చెబుతుంటారు.ఈ మూవీలో సౌందర్య నటన( Soundarya ) అద్భుతంగా ఉంటుంది.ఆమె ప్రతి ఫ్రేమ్‌లో ఒక పెయింటింగ్ లా ఉంటుందంటే అతిశయోక్తి కాదు.
సౌందర్య కర్ణాటకలో పుట్టి పెరిగినా కన్నడలో పెద్దగా మంచి సినిమాలు చేయలేదు.కానీ ఈ ద్వీప అనే ఒక సినిమా చేశానని, అది కన్నడ ఇండస్ట్రీలో మంచి సినిమా తీయలేదనే లోటును తీర్చిందని ఓ ఇంటర్వ్యూలో సౌందర్య తెలిపింది.కర్ణాటకలోని సగర టౌన్‌కు దగ్గరలో ఉన్న లింగనమక్కి జలాశయం( Linganamakki Reservoir ) పరిసరాల్లో ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేశారు.విశేషమేంటంటే ద్వీప మూవీలో 70 శాతం వర్షం కనిపిస్తూనే ఉంటుంది.
కెమెరామెన్ రామచంద్ర హల్కరే ప్రకృతి వల్ల వచ్చిన వర్షంలోనే ఆ సన్నివేశాలు షూట్ చేశాడు.అందుకే అతడికి నేషనల్ అవార్డు కూడా లభించింది.
ఈ సినిమా యూట్యూబ్‌లో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తో అందుబాటులో ఉంది కాబట్టి ఆసక్తి ఉన్నవారు చూడవచ్చు.







