బీజేపీ తెలంగాణ అభ్యర్థుల తొలి జాబితా ఇవాళ విడుదల కానుంది.ఈ మేరకు అభ్యర్థుల పేర్లను ఢిల్లీలో ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇవాళ ఢిల్లీలో కేంద్ర ఎన్నికల భేటీ అనంతరం అభ్యర్థులు ఫస్ట్ లిస్టును ప్రకటించనున్నారు.40 మంది అభ్యర్థులతో తొలి జాబితా ఉండే ఛాన్స్ ఉందని సమాచారం.ఈ క్రమంలోనే మరికాసేపటిలో జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో బీజేపీ ముఖ్య నేతలు సమావేశం కానున్నారు.ఇందులో భాగంగా అభ్యర్థుల ఎంపికతో పాటు ఎన్నికల రోడ్ మ్యాప్, మ్యానిఫెస్టోతో ప్రధానంగా చర్చించనున్నారు.







