శామ్‌సంగ్( Samsung ) కొత్త ఫ్లాగ్‌షిప్ సిరీస్ గెలాక్సీ S24ని 2024 ప్రారంభంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది.ఈ సిరీస్‌లో స్టాండర్డ్ S24, S24 ప్లస్, S24 అల్ట్రా వంటి మూడు మోడల్స్ ఉంటాయి.
కొన్ని లీక్‌ల ప్రకారం, గెలాక్సీ S24 కొన్ని ఆకట్టుకునే ఫీచర్లు, అప్‌గ్రేడ్‌లతో వస్తుంది.అవేంటో తెలుసుకుంటే.
• బ్రైటెస్ట్ డిస్‌ప్లే:

గెలాక్సీ S24( Samsung s24 ) పీక్ బ్రైట్‌నెస్ 2,500 నిట్స్ ఉంటుందని రూమర్స్ వస్తున్నాయి.ఈ బ్రైట్‌నెస్ మార్కెట్లో ఉన్న చాలా ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లన్నిటి కంటే ఎక్కువ.పిక్సెల్ 8 ప్రో గరిష్ట బ్రైట్‌నెస్ 2,400నిట్స్, ఒప్పో ఫైండ్ X6 ప్రో గరిష్ట బ్రైట్‌నెస్ 2,600నిట్స్.బ్రైట్‌నెస్ ఎంత ఎక్కువ ఉంటే వివిధ లైటింగ్ కండిషన్స్‌లో అంత మెరుగైన విజుబిలిటీ, రీడబిలిటీ ఉంటుంది.
గెలాక్సీ S24లో LTPO ప్యానెల్ కూడా ఉంటుందట.ఇది కంటెంట్‌ను బట్టి 48Hz, 120Hz మధ్య రిఫ్రెష్ రేట్‌ను డైనమిక్‌గా అడ్జస్ట్ చేయగలదు.
• పెద్ద బ్యాటరీ
గెలాక్సీ S24 4,000mAh బ్యాటరీ కెపాసిటీతో రానుందని సమాచారం.ఇది మునుపటి మోడళ్ల కంటే ఎక్కువ కెపాసిటీ అని చెప్పవచ్చు.గెలాక్సీ S22, S23 వరుసగా 3,700mAh, 3,900mAh బ్యాటరీలను కలిగి ఉన్నాయి.గెలాక్సీ S24 వైర్‌లెస్ ఛార్జింగ్, రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ చేస్తుందని టాక్.
• పవర్‌ఫుల్ ప్రాసెసర్

గెలాక్సీ S24 క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 3( Snapdragon 8 Gen 3 ) చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుందని భావిస్తున్నారు, ఇది క్వాల్‌కమ్‌కు చెందిన సరికొత్త, మోస్ట్ అడ్వాన్స్‌డ్ ప్రాసెసర్.ఈ చిప్‌సెట్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు, అయితే ఇప్పటిదాకా రిలీజ్ అయిన వాటితో పోలిస్తే ఇది అత్యుత్తమ పనితీరు, సామర్థ్యం, కనెక్టివిటీని అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు.ఈ చిప్‌సెట్ 5G నెట్‌వర్క్‌లు, అడ్వాన్స్‌డ్ AI ఫీచర్లకు కూడా మద్దతు ఇస్తుంది.గెలాక్సీ S24 ఆండ్రాయిడ్ 13లో శామ్‌సంగ్ వన్ UI 4.0తో రన్ అయ్యే అవకాశం ఉంది.గెలాక్సీ S24 సిరీస్ లాంచ్ డేట్ ఇంకా ప్రకటించలేదు, అయితే 2024, జనవరి లేదా ఫిబ్రవరిలో దీన్ని కంపెనీ లాంచ్ చేసే అవకాశం ఉంది.
శామ్‌సంగ్ సాధారణంగా ఏటా ఈ నెలల్లోనే ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లను ప్రకటిస్తుంది.గెలాక్సీ S24 సిరీస్ ధర కూడా ప్రస్తుతానికి తెలియదు.







