బాలయ్య అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కిన భగవంత్ కేసరి( Bhagavanth Kesari ) సినిమా షోలు ఇప్పటికే చాలా ఏరియాలలో పూర్తయ్యాయి.బాలయ్యను అభిమానులు ఏ విధంగా చూడాలని కోరుకుంటున్నారో ఈ సినిమాలో బాలయ్య అదే విధంగా కనిపించారు.
అనిల్ రావిపూడి బాలయ్య మార్క్ లో అదిరిపోయే ఎమోషన్స్ తో ఈ సినిమాను తెరకెక్కించారు.ఇంటర్వెల్, క్లైమాక్స్ సీన్లను అనిల్ రావిపూడి వేరే లెవెల్ లో ప్లాన్ చేశారు.

సెకండాఫ్ లో 20 నిమిషాల పాటు బాలయ్య ఫ్యాన్స్ బాలయ్య ( Balakrishna )నట విశ్వరూపం చూస్తారు.బాలయ్య సరికొత్త గెటప్ ను సినిమాలో చూసి ప్రేక్షకులు థ్రిల్ కావడం గమనార్హం.బాలయ్య నటన, అనిల్ రావిపూడి డైరెక్షన్, థమన్ బీజీఎం, సెకండాఫ్, శ్రీలీల యాక్టింగ్ ఈ సినిమాకు ప్లస్ అయ్యాయి. ఫస్టాఫ్ లో ల్యాగ్ తో ఉన్న కొన్ని సీన్స్, కాజల్ రోల్, కొన్ని ఫైట్ సీన్స్ ను కంపోజ్ చేసిన తీరు సినిమాకు మైనస్ అయింది.
బాలయ్య హ్యాట్రిక్ సాధించినట్టేనని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.అనిల్ రావిపూడి( Anil Ravipudi ) ఫ్యాన్స్ కు మాట ఇచ్చిన విధంగానే బాలయ్యను మునుపెన్నడూ చూడని రోజ్ లో చూపించారు.
ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించేలా అనిల్ రావిపూడి ఈ సినిమాను తీశారు.బేటీ బనావో షేర్ అనే కాన్సెప్ట్ ను అనిల్ రావిపూడి అద్భుతంగా డీల్ చేశారనే చెప్పాలి.

భగవంత్ కేసరి సినిమాలో బాలయ్య ఇచ్చిన మెసేజ్ అద్భుతంగా ఉంది.బాలయ్య లుక్స్ అద్భుతంగా ఉన్నాయి.బాలయ్య శ్రీలీల కాంబో సీన్స్ బాగున్నాయి.థమన్ కొన్ని సీన్స్ ను అయితే అద్భుతంగా ఎలివేట్ చేశారనే చెప్పాలి.అనిల్ రావిపూడి ఈ సినిమాతో కమర్షియల్ డైరెక్టర్ల జాబితాలో చేరినట్టేనని కామెంట్లు వినిపిస్తున్నాయి.భగవంత్ కేసరి కలెక్షన్లు సైతం భారీ స్థాయిలోనే ఉండనున్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.







