ఈ జట్లను చిత్తుగా ఓడిస్తేనే భారత్ సెమీ ఫైనల్ కు చేరే ఛాన్స్..!

భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్( ODI World Cup ) టోర్నీలో ఇప్పటికే 14 మ్యాచులు పూర్తయ్యాయి.పాయింట్ల పట్టికను పరిశీలిస్తే భారత్( India ) అగ్రస్థానంలో నిలిచింది.

 Team India Will Qualify Odi World Cup 2023 Semifinals By Winning On These Teams-TeluguStop.com

ఇదే తరహా ఫామ్ కొనసాగించి ముందుకెళితే భారత్ సులభంగా సెమీఫైనల్ చేరుతుంది.భారత్ తో పాటు న్యూజిలాండ్ దక్షిణాఫ్రికా కూడా సెమీ ఫైనల్ కు వెళ్లే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.

భారత్ తాను ఆడిన మూడు మ్యాచ్లలో ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ జట్లపై విజయం సాధించింది.న్యూజిలాండ్ జట్టు ఆడిన మూడు మ్యాచ్లో ఇంగ్లాండ్, నెదర్లాండ్, బంగ్లాదేశ్ జట్లపై విజయం సాధించింది.

సౌత్ ఆఫ్రికా( South Africa ) జట్టు ఆడిన రెండు మ్యాచ్లో ఆస్ట్రేలియా, నెదర్లాండ్ పై విజయం సాధించింది.ఈ టోర్నీలో భారత్ తో పాటు న్యూజిలాండ్, ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా జట్లు సెమీఫైనల్ చేరేందుకు గట్టి పోటీని ఇస్తున్నాయి.అక్టోబర్ 22న భారత్-న్యూజిలాండ్,( Ind vs NZ ) అక్టోబర్ 29న ఇంగ్లాండ్-భారత్, ( Eng vs Ind ) నవంబర్ 5న భారత్- సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.భారత్ ఈ మూడు మ్యాచ్లలో పై చేయి సాధిస్తే.

కచ్చితంగా సెమీఫైనల్ చేరినట్టే.భారత్ ఈ జట్లపై గెలవడం తప్పనిసరి.

ఎందుకంటే.న్యూజిలాండ్ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో,సౌత్ ఆఫ్రికా మూడో స్థానంలో నిలిచాయి.సౌత్ ఆఫ్రికా గెలిచిన రెండు మ్యాచ్లలో కూడా భారీ పరుగుల తేడా ఉంది.కాబట్టి దక్షిణాఫ్రికా జట్టు రన్ రేట్ మెరుగ్గా ఉంది.ఈ జట్ల నుండి భారత్ కు ప్రమాదం పొంచి ఉందనే చెప్పాలి.భారత జట్టులో ఉండే ఆటగాళ్లందరూ ఫుల్ ఫామ్ ను కొనసాగిస్తూ, ఎటువంటి చిన్న చిన్న పొరపాట్లు కూడా చేయకుండా ఉంటేనే భారత్ ఖాతాలో వరుస విజయాలు చేరి భారత్ వన్డే వరల్డ్ కప్ 2023 టైటిల్ పడుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube