తెలంగాణ రాజకీయాల్లో ప్రమాణాల సవాళ్లు, ప్రతి సవాళ్లు కొనసాగుతున్నాయి.ఈ మేరకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గన్ పార్క్ వద్దకు బయలుదేరారు.
రెండు రోజుల క్రితం డబ్బు, మద్యం లేకుండా ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమా అంటూ సీఎం కేసీఆర్ కు రేవంత్ రెడ్డి ఛాలెంజ్ చేసిన సంగతి తెలిసిందే.అమరవీరుల స్థూపం దగ్గర ప్రమాణం చేసేందుకు రావాలని సవాల్ చేశారు రేవంత్ రెడ్డి.
ఇందులో భాగంగానే ఆయన అక్కడకి చేరుకోనున్నారు.ఈ క్రమంలో గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్దకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలివస్తుండగా ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు.
ఈ క్రమంలో గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్ద పోలీసులు భారీగా మోహరించారు.







