ప్రతి సినిమా సక్సెస్ వెనక డైరెక్టర్ అనే వాడి పాత్ర చాలా ఉంటుంది.ఆయనే లేకపోతే సినిమా అనేది ఉండదు కానీ కొన్ని సినిమాలు హిట్ అయినా కూడా అవి మా వల్లే హిట్ అయ్యాయని హీరోలు గర్వంగా ఫీల్ అవుతూ ఉంటారు.
అలాంటి హీరోలకి బుద్ధి చెప్పడం కోసమే రాజమౌళి ఈగ( Eega movie )ను పెట్టి సినిమా తీసి మంచి హిట్ కొట్టారు.దమ్ము ఉండాలి గాని హీరోతో పనిలేదు ఈగ తో అయిన సినిమా తీసి 50 కోట్ల కలక్షన్స్ ను సాధించొచ్చు అని చూపించాడు.
ఈ సినిమా చాలా అద్భుతంగా ఉంటుంది అది రాజమౌళి మేకింగ్ లో వచ్చింది కాబట్టి చాలా బాగా తీశాడు నిజానికి ఈగ సినిమాని తీయాలి అంటే చాలా ఘాట్స్ ఉండాలి.
ఆ ఘట్స్ రాజమౌళికి( Rajamouli) ఉన్నాయి కాబట్టి ఆ సినిమాను తీసి చూపించాడు.ఇక ఇలాంటి క్రమంలో ఒక సినిమా సక్సెస్ అయిందంటే అది డైరెక్టర్ వల్ల అయింది అని నమ్మే హీరోలు ఉన్నప్పుడే మంచి సినిమాలు వస్తాయి.అంతే తప్ప అన్ని మేమే,మేము లేకపోతే సినిమా లేదు అని గర్వం తో ఫీల్ అయ్యే హీరోలు ఉన్నత కాలం ఆ హీరోకి సరైన సక్సెస్ లు కూడా రావనే చెప్పాలి.
ఇప్పటికీ ఇండస్ట్రీలో చాలామంది హీరోలు సినిమా అంటే హీరో, హీరో అంటే సినిమా అనే భ్రమలోనే బతుకుతున్నారు సినిమా అంటే కంటెంట్ అది ఉంటేనే సినిమా ఆడుతుంది అనే ఒక చిన్నపాటి లాజిక్ ని తెలుసుకుంటే ప్రతి ఒక్క హీరో కి కూడా చాలా మంచి సక్సెస్ లు వస్తాయి.అందుకే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు చాలామంది హీరోలకి ప్లాప్ లు వచ్చాయి కానీ ఇప్పుడు కంటెంట్ బేస్డ్ గా వెళ్తున్నారు కాబట్టి మంచి విజయాలను అందుకుంటున్నారు…
.