గాంజా శంకర్ సినిమా ఇస్మార్ట్ శంకర్ సినిమా కి సంబంధం ఏంటి..?

సినిమా ఇండస్ట్రీలో హిట్ సినిమా తీయడం అనేది చాలా కష్టమైన పని కొందరు మాత్రం వరుసగా హిట్ సినిమాలు తీస్తూ ఇండస్ట్రీలో ది బెస్ట్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకుంటుంటే, మరికొందరు మాత్రం ఎన్ని సినిమాలు చేసిన అన్ని సినిమాలు ఫ్లాప్ అవుతూనే ఉంటున్నాయి.ఇక ఇలాంటి క్రమంలో పూరి జగన్నాథ్ ( Puri Jagannadh )లాంటి డైరెక్టర్ అప్పట్లో చాలా మంచి హిట్టు సినిమాలు తీశాడు.

 What Is The Connection Between Ganja Shankar's Movie And Smart Shankar's Movie,-TeluguStop.com

అయినప్పటికీ ఆయనకి ప్రస్తుతం పెద్దగా మార్కెట్ లేకుండా పోయింది.అందుకే ఇప్పుడు తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి మళ్లీ డబుల్ ఇస్మార్ట్ సినిమా ( Double iSmart )తో మన ముందుకు వస్తున్నాడు.

ఇక ఇది ఇలా ఉంటే ఒక డైరెక్టర్ ఎన్ని సినిమాలు చేసినా అన్ని సినిమాలు కూడా యావరేజ్ గానే మిగులుతున్నాయి తప్ప ఒక్కటి కూడా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టడం లేదు ఆయన ఎవరు అంటే సంపత్ నంది అనే చెప్పాలి.

 What Is The Connection Between Ganja Shankar's Movie And Smart Shankar's Movie,-TeluguStop.com
Telugu Double Ismart, Ganja Shankar, Ismart Shankar, Puri Jagannadh, Sai Dharam

ఈయన ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో ఏమైంది ఈ వేళ అనే సినిమా తీశాడు ఆ సినిమా మంచి విజయాన్ని అందుకున్నప్పటికీ ఆ తర్వాత ఆయన చేసిన రచ్చ, బెంగాల్ టైగర్, గౌతమ్ నంద, సీటిమార్ లాంటి సినిమాలు పెద్దగా సక్సెస్ లను అందుకోలేదు దాంతో ఆయన ప్రస్తుతం గాంజా శంకర్( Ganja shankar ) అనే సినిమా చేస్తున్నాడు.దానికి సంబంధించిన ఫస్ట్ హై నిన్న రిలీజ్ చేయడం జరిగింది.

Telugu Double Ismart, Ganja Shankar, Ismart Shankar, Puri Jagannadh, Sai Dharam

అది మొత్తం తెలంగాణ నేటివిటీతో జరిగే స్టోరీ అని తెలుస్తుంది.ఇక దాంట్లో సాయి ధరమ్ తేజ్ చెప్పిన డైలాగులు కూడా చాలా బాగున్నాయి.అయినప్పటికీ ఈ సినిమా కూడా ఇస్మార్ట్ శంకర్ సినిమాలానే ఉంది అనే విధంగా కామెంట్లను మాత్రం ఎదుర్కొంటుంది.

అయితే ఇస్మార్ట్ శంకర్ సినిమాతో పూరి జగన్నాథ్ ఎలాంటి మ్యాజిక్ అయితే చేశాడో సంపత్ నంది కూడా ఈ సినిమాతో అలాంటి మ్యాజిక్ ని చేయగలడా అనేది ఇక్కడ చర్చించుకోవాల్సిన విషయం.ఏది ఏమైనా ఆ సినిమా సక్సెస్ అవుతుందా లేదా ఫెయిల్యూర్ అవుతుందా తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube