దేశంలోని అత్యంత కఠినమైన పరీక్షలలో నీట్( Neet Exam ) ఒకటి.ఈ పరీక్షలో పాస్ కావాలంటే ఏ స్థాయిలో శ్రమించాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
పేదరికం, ఇతర కారణాల వల్ల చాలామంది కెరీర్ పరంగా సక్సెస్ సాధించలేకపోతున్నారు.అయితే రూపా యాదవ్( Rupa Yadav ) అనే యువతి మాత్రం ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తన లక్ష్యాన్ని సాధించడం ద్వారా వార్తల్లో నిలిచి ప్రశంసలు అందుకుంటున్నారు.
భర్త, బావమరిది సపోర్ట్ వల్ల ఆమె అనుకున్న లక్ష్యాన్ని సాధించారు.ఎనిమిదేళ్ల వయస్సులోనే రూపా యాదవ్ కు పెళ్లి జరిగింది.ఆ సమయంలో రూపా యాదవ్ భర్త వయస్సు 12 సంవత్సరాలు కావడం గమనార్హం.ఒకవైపు ఇంటి పనులు చేస్తూనే మరోవైపు చదువును కొనసాగిస్తూ రూపా యాదవ్ కెరీర్ పరంగా ఒక్కో మెట్టు పైకి ఎదిగి ప్రశంసలు అందుకున్నారు.
కడు పేద కుటుంబం కావడంతో రూపా యాదవ్ భర్త రిక్షా తొక్కి ( Rickshaw ) ఆ డబ్బుతో భార్యను చదివించారు.

భార్య పుస్తకాలు, ఇతర అవసరాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రూపా యాదవ్ భర్త రేయింబవళ్లు కష్టపడ్డారు.2017 సంవత్సరంలో రూపా యాదవ్ నీట్ పరీక్షకు హాజరై 603 మార్కులతో 2612 ర్యాంక్ సాధించారు.భర్త, అత్తామామలు, తల్లీదండ్రులు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేశారు.
కష్టపడితే కెరీర్ పరంగా సక్సెస్ సాధించడం సులువేనని ఆమె ప్రూవ్ చేశారు.

కార్డియాలజిస్ట్( Cardiologist ) కావడమే రూపా యాదవ్ లక్ష్యం కాగా ఆమె సొంతంగా ఆస్పత్రిని తెరిచి వైద్య సేవలను అందించాలని భావిస్తున్నారు.రాబోయే రోజుల్లో రూపా యాదవ్ కల నెరవేరుతుందేమో చూడాల్సి ఉంది.అలుమ్ని అలెన్ కెరీర్ ఇన్‌స్టిట్యూట్ తాజాగా రూపా యాదవ్ ను సత్కరించగా ఆమె పేరు మారుమ్రోగుతోంది.
రూపా యాదవ్ ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.రూపా యాదవ్ కెరీర్ పరంగా మరింత సక్సెస్ సాధించాలని నెటిజన్లు ఆకాంక్షిస్తున్నారు.







