స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ తో పాటు ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది.
జస్టిస్ అనిరుధ్ బోస్, జస్టిస్ త్రివేది ధర్మాసనం విచారణ చేపట్టనుంది.
ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం తరపున న్యాయవాది ముకుల్ రోహత్గి, చంద్రబాబు తరపున హరీశ్ సాల్వే వాదనలు వినిపించనున్నారు.మధ్యాహ్నం 2 గంటలకు విచారణ ప్రారంభం కానుండగా ముందుగా ఫైబర్ నెట్ కేసుపై విచారణ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
కోర్టు నంబర్ 6లో మూడో నంబర్ గా ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ ఉండగా 45వ నంబర్ గా స్కిల్ డెవలప్ మెంట్ కేసులో స్పెషల్ లీవ్ పిటిషన్ లిస్ట్ అయిన సంగతి తెలిసిందే.విచారణలో భాగంగా సెక్షన్ 17(ఏ) వర్తిస్తుందా లేదా అనేది ధర్మాసనం తేల్చనుంది.







