ఝుమ్మంది నాదం సినిమా( Jhummandi Naadam movie ) ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి నటి తాప్సీ( Taapsee ) అనంతరం బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.అయితే ప్రస్తుతం సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె సౌత్ సినిమాలకు పూర్తిగా దూరం అయ్యారు.
అయితే సినిమాలలో నటించకపోవడానికి కారణాన్ని తెలియజేస్తూ ఇక్కడ కమర్షియల్ హీరోలతో చేసే అవకాశాలు నాకు రావడం లేదని అందుకే టాలీవుడ్ కి దూరంగా ఉన్నానని సమాధానం చెప్పారు.ఈ విధంగా ఈమె తరుచూ సినీ ఇండస్ట్రీ గురించి అలాగే సినీ వారసుల గురించి ఏదో ఒక సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.
ఇకపోతే తాజాగా విజయవాడ వచ్చినటువంటి తాప్సి ఇక్కడ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె మాట్లాడుతూ సినీ ఇండస్ట్రీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.సినిమా ఇండస్ట్రీ మొత్తం స్టార్ సెలబ్రిటీల( Star celebrities ) చుట్టే తిరుగుతుందని ఈమె తెలియజేశారు.కేవలం ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా ఓటీటీలో కూడా ఇదే పరిస్థితి ఉందని తెలియజేశారు.
ఇది ఎంతో విచారించాల్సిన విషయం అంటూ ఈ సందర్భంగా తాప్సి చేస్తున్నటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఇక చాలామంది స్టార్ సెలబ్రిటీలు ఒక సినిమాకు కమిట్ అయితే వారి సహా నటీనటుల అర్హత గురించి కూడా ఆలోచిస్తారని ఈమె తెలియజేశారు.
నా విషయానికి వస్తే నేను ఏదైనా ఒక సినిమాకు కమిట్ అయ్యాను అంటే ఇతర సెలబ్రిటీల అర్హత ఏమాత్రం చూడనని తెలిపారు.మనం స్టార్స్ తో సినిమా కనుక చేయకపోతే ఆ సినిమాలను థియేటర్లో కాకుండా ఓటీటీ చూడాలని కొందరు అలాంటి సినిమాలను థియేటర్లో కూడా విడుదల కానివ్వరని తెలిపారు.ఇలాంటి భావన సినిమా ఇండస్ట్రీకి ఏమాత్రం మంచిది కాదని ప్రతి ఒక్కరు ఈ విషయంలో ఆలోచన మార్చుకోవాలని ఈమె తెలియజేశారు.స్టార్ హీరోల సినిమాలు చిన్న సినిమాలను పూర్తిగా మరుగున పడేలా చేస్తున్నాయని, ఈ విషయంలో మార్పులు వస్తేనే ఇండస్ట్రీ బాగుంటుంది అంటూ ఈ సందర్భంగా ఈమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.