టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్( Ram Charan ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.రామ్ చరణ్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
వరుసగా ఒకదాని తర్వాత ఒకటి అవకాశాలను అందుకుంటు దూసుకుపోతున్నారు చెర్రీ.గత ఏడాది ఆర్ఆర్ఆర్ తో ప్రేక్షకులను పలకరించిన రామ్ చరణ్ ఆ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.
కాగా ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ చేంజర్ ( Game changer )సినిమాలో నటిస్తున్నారు.

ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.ఇకపోతే ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ స్థాయి అమాంతం పెరిగిన విషయం తెలిసిందే.
అందుకే ఆయనతో సినిమా చేసేందుకు అన్ని భాషల ఫిలిం మేకర్స్( Film makers ) ఆసక్తి చూపిస్తున్నారు.అంతే కాకుండా అన్ని భాషల మీడియా సంస్థలు కూడా చరణ్ పై ప్రత్యేకంగా దృష్టి సారించాయి.
రామ్ చరణ్ కి సంబంధించిన చిన్న విషయాన్ని కూడా ప్రధానంగా వారు కవరేజ్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

తాజాగా రామ్ చరణ్ తమిళ్ సూపర్ స్టార్ విజయ్ సినిమా లియో( Leo ) లో కీలక పాత్రలు కనిపించబోతున్నాడు అంటూ తమిళ్ మీడియాలో వచ్చిన పుకారు జాతీయ స్థాయిలో సందడి చేసింది.లియో సినిమా హైప్ పెంచేందుకుగాను చరణ్ గెస్ట్ పాత్రలో కనిపించబోతున్నాడని పుకార్లను తమిళ్ మీడియా సృష్టించింది అంటూ కొందరు మెగా కాంపౌండ్ కు చెందిన వారు ఆఫ్ ది రికార్డు మాట్లాడుకుంటున్నారు.లియో సినిమాలో చరణ్ పాత్ర లేదు, చరణ్ కనిపించబోడు అంటూ స్పష్టతనిచ్చిన తర్వాత కూడా అక్కడ ఏదో రకంగా వార్తల్లో ముంచే ప్రయత్నం చేస్తున్నారు.
ఇది ఇలా ఉంటే ఇప్పుడు రామ్ చరణ్ గురించి మరో వార్త తమిళ్ మీడియాలో సందడి చేస్తోంది.అదేంటంటే చరణ్ తో దర్శకుడు శంకర్ ప్రస్తుతం గేమ్ చేంజర్ అనే సినిమాను చేస్తున్నాడు.
ఆ సినిమా తర్వాత వెంటనే ఇండియన్ 3 సినిమాను చరణ్ తో చేసేందుకు శంకర్ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడు అంటూ తమిళ్ మీడియాలో ఈ మధ్యకాలంలో వస్తున్న వార్తల సారాంశం.తమిళ్ మీడియా వారు ఈ విషయమై అత్యుత్సాహంతో భారీగా కథనాలను అల్లేస్తున్నారు.
ఇప్పటి వరకు అలాంటి చర్చలు ఏమీ జరగలేదని మెగా కాంపౌండ్ నుంచి ఈ విషయంలో కూడా క్లారిటీ వస్తుంది.తమిళ్ మీడియా పదేపదే రామ్ చరణ్ కి సంబంధించిన పుకార్లను పుట్టిస్తూ పబ్బం గడుపుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.







