నాని( Nani ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన.ఎంతో సహజమైన నటనతో ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేసే నాని నాచురల్ స్టార్ అనే బిరుదును కూడా సంపాదించుకున్నారు.
ఇలా నాని హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తన టాలెంట్ తో వరుస సినిమా అవకాశాలను అందుకొని పాన్ ఇండియా స్థాయిలో తన సినిమాలను విడుదల చేసే స్థాయికి ఎదిగారు.ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినటువంటి ఈయన కెరియర్ మొదట్లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారు.
ఇలా నాని ఇండస్ట్రీలో హీరోగా అవకాశాలను అందుకున్న అనంతరం నిర్మాతగా కూడా మారిపోయారు.
ఒకప్పుడు సినిమా అవకాశాల కోసం తాను కూడా ఎన్నో ప్రయత్నాలు చేశాను అయితే చాలామంది తనకు అవకాశాలు ఇవ్వలేదు అలాగే టాలెంట్ ఉండి ఇండస్ట్రీలోకి వచ్చే కొత్త వాళ్లకు మద్దతు లభిస్తే వారు కూడా తమ టాలెంట్ ప్రూవ్ చేసుకుంటారన్న ఉద్దేశంతో నాని కొత్త వారికి సినిమా అవకాశాలను కల్పిస్తూ ఉంటారు.
ఇలా కొత్త దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేయడం లేదా ఈయన తన నిర్మాణంలో కొత్త వారిని ఇండస్ట్రీకి తీసుకురావడం జరుగుతుంది.ఇలా ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా స్టార్ హీరోగా ఇండస్ట్రీలో నాని కొనసాగుతూ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు అని చెప్పాలి.
కెరియర్ పరంగా నాని ఎంతో అద్భుతమైన మంచి సక్సెస్ అందుకున్నారు.ఇలా కెరియర్ పరంగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి నాని గురించి తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఒకప్పుడు సోషల్ మీడియా లేకపోవడంతో సినీ వార పత్రికలలో హీరో హీరోయిన్ల గురించి వచ్చే విషయాలను మాత్రమే మనం తెలుసుకోగలము.కానీ ఇప్పుడు సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత సెలబ్రిటీలకు సంబంధించిన ఏ చిన్న విషయం అయినా క్షణాల్లో వైరల్ అవుతుంది అలాగే వారి గురించి లేనిపోని కథనాలను కూడా సృష్టించి వైరల్ చేస్తుంటారు.

ఈ విధంగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి ఎంతోమంది సెలబ్రిటీలకు( celebrities ) సంబంధించినటువంటి ఫేక్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమయంలో వారు ఈ వార్తలపై స్పందిస్తూ క్లారిటీ ఇస్తూ వచ్చారు.ఈ క్రమంలోనే నాని గురించి కూడా ఇలాంటి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు.నాని కెరియర్ పరంగా ఎంతో మంచి సక్సెస్ అందుకొని వైవాహిక జీవితంలో కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు.ఈయన తన స్నేహితురాలు అంజనా( Anjanaa ) అనే అమ్మాయిని ప్రేమించి పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు ఈ దంపతులకు ఒక కుమారుడు కూడా ఉన్నారు.

ఇలా వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నటువంటి నాని అంజనా మధ్య గొడవలు తలెత్తాయని ఈ గొడవల కారణంగా ఒకానొక సందర్భంలో వీరిద్దరూ విడాకుల వరకు వెళ్లారని తెలుస్తుంది.నాని హీరోయిన్లతో కలిసి సరదాగా మూవ్ అవ్వడం మనం చూస్తుంటాము.ఈ క్రమంలోనే ఫలానా హీరోయిన్ తో నానికి ఎఫైర్ ఉందంటూ కొందరు అసత్యపు వార్తలను పుట్టించారు.నాని గురించి ఇలాంటి వార్తలు రావడంతో అందరూ షాక్ అయ్యారు.
అయితే ఈ వార్తలపై స్పందించినటువంటి నాని సెలబ్రిటీలు అన్న తర్వాత వారి గురించి ఇలాంటి వార్తలు రావడం సర్వసాధారణం అయితే నా గురించి నా భార్య గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఏమాత్రం నిజం లేదని ఈ వార్తలను ఖండించారు.







