Bhagwant Kesari :భగవంత్ కేసరికి ఆ డైలాగ్ కీలకం కానుందా.. ఆ డైలాగ్ కు థియేటర్స్ దద్దరిల్లుతాయంటూ?

టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ( Actor Balakrishna ) హీరోగా నటించిన తాజా చిత్రం భగవంత్ కేసరి( Bhagwant Kesari ).ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించగా శ్రీ లీల కూతురి పాత్రలో నటించిన విషయం తెలిసిందే.

 Balakrishna Will Be Explaining How Girls Should Be Raised In Bhagavanth Kesari-TeluguStop.com

అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.ఎప్పుడు కామెడీ తరహా సినిమాలను మాత్రమే తెరకెక్కించిన అనిల్ రావిపూడి( Anil Ravipudi ) ఈసారి కాస్త రూట్ మార్చి ఎమోషనల్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు.

ఇకపోతే ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని నందమూరి అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

Telugu Anil Ravipudi, Balakrishna, Dialogue, Harish Peddi, Sahu Garapati, Tollyw

బాలయ్య బాబు ఈ ఏడాది ఆరంభంలో వీర సింహారెడ్డి( Veera Simha Reddy ) ఈ సినిమాతో ప్రేక్షకులను పలకరించడంతోపాటు ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టును అందుకున్న విషయం తెలిసిందే.దీంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.ఈ సినిమాలో బాలయ్య స్పీచ్ అమ్మాయిల తల్లి, తండ్రులకు ఒక క్లాస్ లాంటిదని అంటున్నారు.ఎలా ఆడపిల్లలను పెంచాలి,వాళ్లు చిన్నప్పుడుగా ఉన్నప్పుడు ఏమి ఆలోచిస్తారు.అన్ని వయస్సులోనూ మగాళ్ల నుంచి ఏ విధమైన హెరాస్మెంట్ కు గురి అవుతూంటారు వంటి విషయాలను చెప్తూ ఆ డైలాగు సాగుతుందట.ఆడపిల్లల జీవితంలో ఎదుర్కొనే ముఖ్యమైన సమస్యలను డైలాగులా సాగే ఆ స్పీచ్ లో ఉంటుందని,ఖచ్చితంగా అదిరిపోయే రెస్పాన్స్ థియేటర్స్ లో వస్తుందని అంటున్నారు.

Telugu Anil Ravipudi, Balakrishna, Dialogue, Harish Peddi, Sahu Garapati, Tollyw

ఆ డైలాగులకు థియేటర్ మొత్తం దద్దరిల్లిపోతుంది అంటూ కామెంట్లు జోరుగా వినిపిస్తున్నాయి.అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో సాహు గారపాటి, హరీశ్‌ పెద్ది ( Sahu Garapati, Harish Peddi )నిర్మించిన ఈ చిత్రం ఈనెల 19న విడుదల కానుంది.ఇప్పటికే చిత్ర బృందం సినిమా ప్రమోషన్స్ ని వేగవంతం చేసేసింది.సినిమా విడుదల కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూడడంతో పాటు ఇప్పటికే అందుకు సంబంధించిన ఏర్పాట్లను చేసుకుంటున్నారు.

ఇక సినిమా విడుదల సందర్భంగా బాలయ్య బాబు మాట్లాడుతూ… నవరాత్రులు జరుపుకుంటున్న శుభతరుణంలో నా 108వ చిత్రం భగవంత్‌ కేసరి విడుదలవుతుండటం నాకు చాలా ఆనందంగా ఉంది.దుర్గ అంటే స్త్రీ శక్తి.

ఈ సినిమా కథ కూడా స్త్రీశక్తికి సంబంధించినదే.దుర్గమ్మ వాహనం పులి.

ఇందులో అమ్మాయిని పులిలా పెంచాలనే మాట రాశారు దర్శకుడు అనిల్‌ రావిపూడి.ఆ తల్లి ఆశీస్సులతో ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుందని నా నమ్మకం అని చెప్పుకొచ్చారు బాలయ్య బాబు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube