తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు.ఈ మేరకు కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ మ్యానిఫెస్టోపై స్పందించారు.
కాంగ్రెస్ డిక్లరేషన్లను, గ్యారెంటీలను కేసీఆర్ కాపీ కొట్టారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.తాము పెన్షన్ రూ.4 వేలు ప్రకటిస్తే ఎలా సాధ్యమని ప్రశ్నించిన బీఆర్ఎస్ ఇప్పుడు వారి మ్యానిఫెస్టోలో రూ.5 వేలు ఇస్తామని ఎలా ప్రకటించిందని ప్రశ్నించారు.కర్ణాటకలో డబ్బు పట్టుబడితే తమకేం సంబంధమని నిలదీశారు.ఇండియా కూటమిలో చేర్చుకోవాలని వేల కోట్ల ఆశ చూపెట్టారని ఆరోపించారు.అదేవిధంగా డబ్బు రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్ కేసీఆర్ అని ధ్వజమెత్తారు.ఈ క్రమంలో మందు, డబ్బు లేకుండా ఎన్నికలకు వెళ్దామన్న రేవంత్ రెడ్డి దీనిపై ఈనెల 17వ తేదీన అమరవీరుల స్థూపం వద్ద ప్రమాణం చేద్దామని సవాల్ చేశారు.