అర్థరాత్రులు సమంత కి మెసేజిలు చేస్తూ టార్చర్ చేస్తున్న గుర్తు తెలియని వ్యక్తి..వైరల్ అవుతున్న పోస్ట్!

సౌత్ ఇండియా లో బిగ్గెస్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరోయిన్స్ లిస్ట్ తీస్తే అందులో సమంత( Samantha ) కచ్చితంగా ఉంటుంది.ఈమె ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి కేవలం 13 ఏళ్ళు మాత్రమే అయ్యింది.

 Samantha Shares Whatsapp Screenshot About Her Gym Trainer Details, Samantha , Sa-TeluguStop.com

ఈ 13 ఏళ్లలో ఆమె సాధించిన విజయాలు, తెచ్చుకున్న స్టార్ స్టేటస్ ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన స్టార్ హీరోయిన్స్ కి అసాధ్యం అనే చెప్పాలి.హీరోయిన్ గా దాదాపుగా సౌత్ లో అందరితో నటించింది సమంత.

నాగ చైతన్య తో( Naga Chaitanya ) పెళ్లి జరిగిన తర్వాత ఆమె సినిమాల సంఖ్య అంతకు ముందు తో పోలిస్తే తగ్గిస్తూ వచ్చింది.కానీ అతనితో విడాకులు తీసుకున్న తర్వాత సమంత వరుసగా సినిమాలు మరియు వెబ్ సిరీస్ లు చెయ్యడం ప్రారంభించింది.

కేవలం హీరోయిన్ రోల్స్ మాత్రమే కాకుండా, లేడీ ఓరియెంటెడ్ రోల్స్ మరియు విలన్ రోల్స్ కూడా చేసింది.అలా వైవిధ్యభరితమైన పాత్రలు పోషిస్తూ నేటి తరం సావిత్రిగా పేరు తెచ్చుకుంది.

Telugu Samantha, Naga Chaitanya, Samantha Gym-Movie

ఇకపోతే సమంత ఇటీవల కాలం లో మయోసిటిస్( Myositis ) అనే అరుదైన వ్యాధితో బాధ పడిన సంగతి అందరికీ తెలిసిందే.ఇది కండరాలకు సంబంధించిన వ్యాధి.ఇది సోకినా ఎవరైనా సరే బలహీనంగా తయారు అవుతారు.సమంత ఈ సమస్యతో చాలా కాలం పోరాటం చేసింది.ప్రాణాలకు అత్యంత ప్రమాదకరమైన వ్యాధి అయ్యినప్పటికీ కూడా ఒంటరిగా నిలబడి పోరాడి , ఆ వ్యాధి నుండి బయటపడింది.సమంత ఫిట్నెస్ ఫ్రీక్( Samantha Fitness ) అనే విషయం మన అందరికీ తెలిసిందే.

షూటింగ్స్ లేని సమయం లో ఆమె ఎక్కువగా జిమ్ లోనే కాలం గడుపుతూ ఉంటుంది.ఆమె చేసే వర్కౌట్స్ చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే.

అసలు ఒక అమ్మాయి ఈ రేంజ్ లో వర్కౌట్స్ ఎలా చెయ్యగలదు అని అనిపిస్తాది.అయితే రీసెంట్ గా ఈమె కాసేపటి క్రితమే ఇంస్టాగ్రామ్ లో ఒక స్టోరీ పెట్టింది.

అది ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.

Telugu Samantha, Naga Chaitanya, Samantha Gym-Movie

తన జిమ్ ట్రైనర్( Gym Trainer ) అర్థ రాత్రి సమంత కి మెసేజి చేస్తూ, రేపు వర్కౌట్ కి వస్తున్నావ్ కదా అని అడుగుతాడు.అప్పుడు సమంత బాడీ పైన్స్ బాగా ఉన్నాయి, ఈరోజు లీవ్ తీసుకుంటాను అని అంటుంది.అప్పుడు ఆ జిమ్ ట్రైనర్ నేను ఇక్కడే ఉన్నాను అని అంటాడు.

రాలేను అని చెప్పినా కూడా బలవంతంగా జిమ్ కి తీసుకెళ్లి వర్కౌట్స్ చేయించాడు అట.ముందు కంటే ఎక్కువగా ఈరోజు వర్కౌట్స్ చేయించినట్టు సమంత చెప్పుకొచ్చింది.రీసెంట్ గానే మయోసిటిస్ కి చివరి చికిత్స చేయించుకున్న సమంత, ఒక ఏడాది పాటు సినిమాలకు పూర్తిగా బ్రేక్ ఇవ్వనుంది.డాక్టర్లు ఇచ్చిన సూచన మేరకు ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube