స్వదేశంలో జరుగుతున్న వరల్డ్ కప్ టోర్నీలో( World Cup tournament ) భారత్ మంచి జోరు మీద ఉంది.వరుస విజయాలతో దూసుకుపోతోంది.
మొదటి మ్యాచ్ ఆస్ట్రేలియా రెండో మ్యాచ్ ఆఫ్ఘనిస్తాన్ తర్వాత మూడో మ్యాచ్ పాకిస్తాన్ పై విజయాలు నమోదు చేసుకోవడం జరిగింది.నేడు అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో భారత్ ఏడు వికెట్ల తేడాతో పాకిస్తాన్ పై గెలుపొందింది.
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్.పాకిస్తాన్ ని 191 పరుగులకు ఆలౌట్ చేయడం జరిగింది.
భారత్ బౌలర్లు కుల్డీప్, సిరాజ్, బుమ్రా, జడేజా అద్భుతంగా రాణించడం జరిగింది.
పాకిస్తాన్ బ్యాట్స్ మెన్స్ ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ ( Abdullah Shafiq )24 బంతుల్లో 20 పరుగుల చేసి అవుట్ అవ్వగా.
ఇమామ్ ఉల్ హక్ 36 పరుగులు చేశాడు.మూడో వికెట్ పడటానికి చాలా టైం పట్టింది.కానీ ఎప్పుడైతే మూడో వికెట్ కెప్టెన్ బాబర్ అజమ్ 50 పరుగులు చేసి సిరాజ్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడో ఆ తర్వాత.పరిస్థితి మొత్తం మారిపోయింది.
అనంతరం రిజ్వాన్( Rizwan ) 49 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టాడు.ఆ తర్వాత ఎవరూ పెద్దగా ఎవరు క్రీజ్ లో నిలదోక్కుకోలేకపోయారు.191 పరుగులకే అల్ అవుట్ అవ్వడం జరిగింది.అనంతరం 191 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఆటగాళ్లు.మూడు వికెట్ల నష్టానికి 30.3 ఓవర్ లోనే.టార్గెట్ చేదించడం జరిగింది.కెప్టెన్ రోహిత్ గతంలో మాదిరిగా దూకుడుగా ఆడి 86 పరుగులు చేశారు.మిగతా బ్యాట్స్ మెన్స్ శ్రేయస్ 46*, గిల్ 16, కోహ్లీ 16, రాహుల్ 19*.పరుగులు చేయడం జరిగింది.పాకిస్తాన్ పై గెలుపుతో వరల్డ్ కప్ టోర్నీలో పాయింట్ల పట్టికలో భారత్ అగ్రస్థానానికి చేరుకుంది.