Aishwarya Dhanush : ధనుష్ ఐశ్వర్య మళ్లీ కలవనున్నారా.. విడాకులకు దరఖాస్తు మాత్రం చేయలేదంటూ? 

కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రెటీ కపుల్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి ఐశ్వర్య రజనీకాంత్( Aishwarya Rajinikanth ) అలాగే నటుడు ధనుష్( Danush ) జంట ఒకటి అని చెప్పాలి.రజినీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్య హీరో ధనుష్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

 Dhanush Ans Aishwarya Will Patchup After Rajinikanth Suggestion-TeluguStop.com

ఇలా వైవాహిక జీవితంలో 18 సంవత్సరాల పాటు ఎంతో సంతోషంగా ఉన్నటువంటి ఈ జంట కొన్ని మనస్పర్ధలు కారణంగా పెళ్లైనటువంటి 18 సంవత్సరాలకు విడిపోయారు.ఇలా ఈ జంట విడిపోతున్నామని ప్రకటించడంతో అభిమానులు ఒక్కసారిగా ఆందోళన చెందారు.

తిరిగి వీరిద్దరూ కలిస్తే బాగుంటుందని అందరూ భావించారు.

Telugu Dhanush Divorce, Rajinikanth, Kollywood-Movie

ఈ విధంగా ఐశ్వర్య ధనుష్ ఇద్దరు కూడా తిరిగి కలుసుకోబోతున్నారు అంటూ ఒకానొక సందర్భంలో వార్తలు కూడా వచ్చాయి అయితే ఈ వార్తలలో ఏ మాత్రం నిజం లేదని వీరిద్దరూ తిరిగి కలుసుకునే అవకాశం ఏ లేదని అలాంటి ఆలోచనలు కూడా చేయడం లేదని తెలుస్తుంది.ఇలా విడిపోయినటువంటి ఈ జంట ప్రస్తుతం వారి సినీ కెరియర్ పై ఫోకస్ పెట్టి ఇద్దరు కూడా వరుస సినిమా పనులలో ఎంతో బిజీగా ఉన్నారు.ఇకపోతే తాజాగా ఐశ్వర్య ధనుష్ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వీరిద్దరూ విడిపోయిన మాట వాస్తవమే అయినప్పటికీ ఇప్పటివరకు విడాకుల ( Divorce ) కోసం అప్లై చేయలేదట.

Telugu Dhanush Divorce, Rajinikanth, Kollywood-Movie

వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడిపోవాలని విడివిడిగా ఉండాలని నిర్ణయించుకొని దూరంగా ఉన్నారని అయితే పిల్లల కోసం తరచూ వీరిద్దరూ కొన్ని సందర్భాలలో కలుస్తున్న సంఘటనలు మనం చూస్తున్నాము అయితే విడిపోవాలని నిర్ణయించుకున్నటువంటి వీరిద్దరూ ఇప్పటివరకు విడాకులకు అప్లై చేయకపోవడం గమనార్హం.బహుశా వీరిద్దరూ తిరిగి పెళ్లి చేసుకోవాలనుకున్న లేదా విడాకుల అవసరం అయినప్పుడు దరఖాస్తు చేసుకుందాంలే అన్న ఉద్దేశంతో విడాకులకు ఇప్పటివరకు అప్లై చేయలేదని తెలుస్తోంది.విడాకులకు అప్లై చేయకపోయినా భవిష్యత్తులో ఎప్పుడైనా కలుసుకోవాలనిపిస్తే కలుసుకుంటారా అన్న సందేహాలు కూడా కొందరికి వ్యక్తం అవుతున్నాయి.

కానీ వీరిద్దరూ తిరిగి కలుసుకునే అవకాశాలే లేవని కూడా వీరి సన్నిహితులు తెలియజేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube