ఓ యువకుడికి డేటింగ్ యాప్ లో ఓ కిలాడీ లేని పరిచయమైంది.గుడ్డిగా నమ్మిన ఆ యువకుడిని మత్తుమందు ఇచ్చి నిలువు దోపిడీ చేసేసింది.
ఆ యువకుడి వద్ద ఉండే నగదు, బంగారు, ఐఫోన్ తో పాటు బ్యాంకు ఖాతాను కూడా ఖాళీ చేసేసింది.పాపం ఆ బాధితుడు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించిన ఘటన హర్యానాలోని గురు గ్రామ్( Guru Gram ) లో చోటుచేసుకుంది.
అసలు ఏం జరిగిందో అనే వివరాలు చూద్దాం.వివరాల్లోకెళితే.
గురు గ్రామ్ కు చెందిన ఓ యువకుడు రోహిత్ గుప్త కు బంబుల్ డేటింగ్ యాప్ లో సాక్షి అలియాస్ పాయల్ అనే మహిళతో పరిచయం ఏర్పడింది.తన స్వస్థలం ఢిల్లీ అని, గురుగ్రామ్ లో తన అత్తతో నివసిస్తున్నానని పాయల్ చెప్పింది.
ఒక వారం కిందట రోహిత్ గుప్తా ( Rohit Gupta )కు ఫోన్ చేసి కలుద్దామని పాయల్ చెప్పడంతో.అనుకున్న ప్రకారం రోహిత్ వాళ్ళ ఇంటికి పాయల్ వచ్చింది.

కాసేపు సరదాగా మాట్లాడుకున్న తర్వాత రోహిత్ ఇంటి సమీపంలో ఉండే మద్యం దుకాణానికి వెళ్లి మద్యం తెచ్చుకున్నారు.ఆ తర్వాత మద్యం లోకి ఐస్ ఉంటే బాగుంటుందని.రోహిత్ ను ఐస్ తెచ్చేందుకు బయటకు పంపించింది.రోహిత్ బయటకు వెళ్లి వచ్చే లోపల ఆ మద్యం లో ఏదో మత్తుమందు కలిపింది.ఆ మత్తుమందు కలిపిన మద్యం తాగిన రోహిత్ స్పృహ కోల్పోయాడు.

అక్టోబర్ ఒకటవ తేదీ మద్యం తాగి స్పృహ కోల్పోతే, అక్టోబర్ మూడవ తేదీ ఉదయం మెలుకువ వచ్చింది. రోహిత్ గుప్తా మెలకువ వచ్చాక చూస్తే.ఇంట్లో పాయల్( Payal ) కనిపించలేదు.
తన ఒంటిపై ఉండే బంగారం, ఇంట్లో ఉండే నగదు, ఐఫోన్ 14 ప్రో, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ కనిపించలేదు.తన బ్యాంక్ అకౌంట్ పరిశీలిస్తే రూ.1.78 లక్షలు విత్ డ్రా అయినట్లు తెలిసింది.దీంతో తాను నిలువు దోపిడీకి గురైన సంగతి గుర్తించిన రోహిత్ గుప్తా సదరు కిలాడీ లేడి పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.







