తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న నటులు మంచి స్థాయిలో పర్ఫామెన్స్ ఇస్తు మంచి గుర్తింపు ను తెచ్చుకుంటున్నారు.ఇక అందులో కొందరు మాత్రం చాలా వైవిధ్య మైన పాత్రలు చేస్తూ నటులుగా ఇండస్ట్రీ లో రాణిస్తున్నారు.
ఇక ఇలాంటి సమయంలో వాళ్లు చేసే సినిమాలు కూడా వాళ్ల కెరీర్ ని మంచి దారిలో పెడుతున్నాయి.ఇక ఇలాంటి సమయంలో తెలుగు సినిమా ఇండస్ట్రీకి దొరికిన అద్భుతమైన నటుడు మురళీ శర్మ…

ఈయన మహేష్ బాబు హీరో వచ్చిన అతిథి సినిమా( Athidhi )తో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చాడు ఆ సినిమా ఆశించిన విజయం సాధించనప్పటికీ ఆయన నటుడుగా మంచి పేరు అయితే సంపాదించుకున్నాడు.ఇక ఈ సినిమా తర్వాత ఆయనకు వరుసగా ఇండస్ట్రీలో ఆఫర్లు రావడం మొదలయ్యాయి.అప్పటినుంచి ఇప్పటివరకు చాలా సినిమాలు చేస్తూ నటుడిగా చాలా ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్నాడు.
తనదైన నటనతో ఆ క్యారెక్టర్ కి జీవం పోస్తూ అద్భుతమైన నటనను కనబరుస్తున్నాడు.మరి ముఖ్యంగా ఆయన నాని హీరోగా వచ్చిన బలే బలే మగాడివోయ్( Bhale Bhale Magadivoy ) సినిమా తో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ లో నటించి మెప్పించడంతో ఆయనకు ఇండస్ట్రీలో డిఫరెంట్ క్యారెక్టర్లు చేస్తాడు అనే పేరు వచ్చింది.

ఇక త్రివిక్రమ్ డైరెక్షన్ లో వచ్చిన అలా వైకుంఠపురం లో సినిమాలో ఒక డిఫరెంట్ మ్యానరిజం తో చేసి నటుడుగా తనలోని పూర్తి ప్రతిభను బయటకు తీశాడు.ఇక జనాలు థియేటర్ లో మురళి శర్మ స్క్రీన్ మీద కనిపిస్తే చాలు అరుపులు, ఈలలు వేస్తూ అల్లరి చేస్తున్నారు.దాంతో మురళి శర్మ ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీకి మోస్ట్ వాంటెడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయాడు…ఇక ఇప్పుడు ఈయన చాలా పెద్ద పెద్ద సినిమాలు చేస్తూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టాప్ పొజిషన్ లో కొనసాగుతున్నారు….అయితే ప్రస్తుతం ఈయన సినిమాని బట్టి ఒక రోజుకి దాదాపు గా 4 నుంచి 5 లక్షల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు గా తెలుస్తుంది…
.







