మద్యంపై వైసీపీ ప్రభుత్వానివి కాకి లెక్కలు..: పురంధేశ్వరి

ఏపీలో మద్యం విక్రయాలపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.రాష్ట్రంలో 34.5 శాతం మంది మద్యం సేవిస్తున్నారని తెలిపారు.

 Ycp Government's Calculations On Alcohol Are Crow's Feet..: Purandheswari-TeluguStop.com

మద్యంపై వైసీపీ ప్రభుత్వం కాకి లెక్కలు చెబుతోందని పురంధేశ్వరి మండిపడ్డారు.

మద్యం కంపెనీల యజమానుల పేర్లను ప్రజాక్షేత్రంలో పెట్టే దమ్మూ సీఎంకు ఉందా అని ప్రశ్నించారు.ఏపీ ప్రభుత్వం డిజిటల్ పేమెంట్లను ఎందుకు ప్రోత్సహించడం లేదన్న పురంధేశ్వరి ఏపీలో నాసిరకం మద్యం ఏరులై పారుతోందని ఆరోపించారు.

చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై అమిత్ షా ఆరా తీశారని తెలిపారు.చంద్రబాబు అరెస్టు వెనుక బీజేపీ హస్తం లేదని పేర్కొన్నారు.

ఎఫ్ఐఆర్ లో పేరు లేదన్న ఆమె అయినా అరెస్ట్ చేశారని వెల్లడించారు.ఈ క్రమంలో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారా లేదా అనేది కోర్టు తేల్చుతుందని వెల్లడించారు.

ఈ క్రమంలో తనపై వస్తున్న ఆరోపణలపై జగన్ సీబీఐ ఎంక్వైరీ వేయించుకుంటారా అని ప్రశ్నించారు.జైల్లో ఉన్న చంద్రబాబుకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ఎవరిదని ఆమె ప్రశ్నించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube