తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ఒకరు.నటుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈయన పుష్ప (Pushpa) సినిమాతో ఏకంగా పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిపోయారు.
ఈ సినిమా ద్వారా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి అల్లు అర్జున్ ప్రస్తుతం కెరియర్ పరంగా వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.ఇకపోతే ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్న విషయం మనకు తెలిసిందే.
అల్లు అర్జున్ హీరోగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నప్పటికీ ఆయన వద్ద ఉన్నటువంటి తన స్టాఫ్ కి మాత్రం ఎప్పుడు కూడా సొంత కుటుంబ సభ్యులుగా చూసుకుంటారని ఎంతోమంది ఇదివరకే అల్లు అర్జున్ దగ్గర పని చేస్తున్నటువంటి వారు తెలియజేసారు.అయితే అల్లు అర్జున్ షూటింగ్ సమయంలో తన కారవాన్( Caravan ) ఉపయోగిస్తూ ఉంటారు.
ఈ క్రమంలోనే తన కేరవాన్ డ్రైవర్ లక్ష్మణ్(Laxman) గురించి తాజాగా కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి.లక్ష్మణ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అల్లు అర్జున్ గురించి ఎన్నో ఆసక్తికరమైనటువంటి విషయాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ నేను అల్లు అర్జున్ గారికి వీరాభిమానిని.తాను మొదట బోయపాటి శీను గారి దగ్గర పనిచేశాను.అలా బోయపాటి గారి నుంచి తాను అల్లు అర్జున్ వద్దకు వచ్చానని ఈయన తెలియజేశారు.అల్లు అర్జున్ గారు చాలా గొప్ప మంచి మనసు కలవారిని తెలియజేశారు.
అలా వైకుంఠపురం సినిమా విడుదలైన తర్వాత మేము ఎవరు కూడా ఊహించని విధంగా ఆయన మాకు బోనస్ రూపంలో పెద్ద మొత్తంలో డబ్బును కానుకగా ఇచ్చారని లక్ష్మణ్ కు వెల్లడించారు.

ఇలా అల్లు అర్జున్ అభిమానిగా( Allu Arjun Fan ) ఈయన ఏకంగా అల్లు అర్జున్ పేర్లను టాటూగా వేయించుకోవడం చూస్తుంటే ఆయన పట్ల ఎంతో అభిమానాన్ని కలిగి ఉన్నారో తెలుస్తోంది.సాధారణంగా క్యారవాన్ మైంటైన్ చేయాలి అంటే ప్రత్యేకమైన శిక్షణ కూడా ఎంతో అవసరం.ఈ క్రమంలోనే అల్లు అర్జున్ ఈ క్యారవాన్ తయారు చేయించుకుంటున్న సమయంలో ఈయన కూడా పూణేలో( Pune ) దాదాపు నెల రోజులపాటు అక్కడే ఉండి ఈ క్యారవాన్ ఎలా మైంటైన్ చేయాలి ఎలా డ్రైవ్ చేయాలి అనే విషయాలన్నింటినీ కూడా తాను శిక్షణ తీసుకున్నాను అని లక్ష్మణ్ తెలిపారు.

క్యారవాన్ కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నటువంటి లక్ష్మణ్ ఎంత మొత్తంలో రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు అనే విషయాల గురించి ఈయన మాట్లాడుతూ తనకు నెలకు రెండు లక్షల పైగా శాలరీ అందుతున్నట్లు వెల్లడించారు.ఇలా క్యారవాన్ డ్రైవర్ గా( Caravan Driver ) అందుకున్నటువంటి ఈ శాలరీ గురించి సోషల్ మీడియాలో వార్తలు రావడంతో పెద్ద ఎత్తున అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.ఇక అల్లు అర్జున్ గారి గురించి లక్ష్మణ్ మాట్లాడుతూ ఆయన మమ్మల్ని ఒక వర్కర్ మాదిరిగా ట్రీట్ చేయరని సొంత కుటుంబ సభ్యులు గానే ట్రీట్ చేస్తారని తెలిపారు.సార్ దగ్గరికి వచ్చినప్పటి నుంచి నా ప్రతి బర్త్డేకి సార్ స్వయంగా కేక్ తెప్పించి నా చేత కట్ చేయిస్తారని, నాకు ఎప్పటికీ మధుర జ్ఞాపకమే అంటూ లక్ష్మణ్ తెలిపారు.
అల్లు అర్జున్ గారికి నేను అభిమానిని ఆయనతో ఒక ఫోటో దిగితే చాలు అనుకున్నాను కానీ ఇలా ఆయనే పుట్టినరోజు చేస్తారని అసలు ఊహించలేదు అంటూ లక్ష్మణ్ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.







