ముమైత్ ఖాన్ ( Mumaith khan )పరిచయం అవసరం లేని పేరు.ఈమె సినిమా ఇండస్ట్రీలో ఎన్నో స్పెషల్ సాంగ్స్ చేస్తూ తన నటనతో పెద్ద ఎత్తున కుర్రకారులను ఓ రేంజ్ లో సందడి చేసిందని చెప్పాలి.
ముమైత్ ఖాన్ స్పెషల్ సాంగ్ ( Special song )లేని సినిమా అంటూ వచ్చేది కాదు ముఖ్యంగా పోకిరి సినిమాలో</em( Pokkiri movie ) ఈమె చేసిన స్పెషల్ సాంగ్ మరో లెవల్లో హిట్ అయిందని చెప్పాలి.ఇలా ఎన్నో సినిమాలలో స్పెషల్ సాంగ్స్ ద్వారా పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నటువంటి ముమైత్ ఖాన్ ఈమధ్య కాలంలో ఇండస్ట్రీకి పూర్తిగా దూరమయ్యారనే విషయం మనకు తెలిసిందే.

ఇలా ఎన్నో సినిమాలలో స్పెషల్ సాంగ్స్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె ఉన్నఫలంగా సినిమా ఇండస్ట్రీకి దూరం కావడానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే ఈమె ఇండస్ట్రీలో కొనసాగుతున్న సమయంలోనే మరొక నటుడితో ఎఫైర్స్ పెట్టుకోవడం ఒక కారణం కాగా, ఈమె డ్రగ్స్ కేసులో చిక్కుకోవడం మరొక కారణమని కూడా చెప్పాలి.ఈమె ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రెటీగా కొనసాగుతున్న సమయంలో ఒక సినిమా వేడుకలో ప్రముఖ కమెడియన్ అలీ సోదరుడు ఖయ్యూం( Khayyam )తో ఈమెకు పరిచయం ఏర్పడిందట అయితే అప్పట్లో ఈయన కూడా పలు సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తూ సందడి చేసేవారు.

ఈ విధంగా ముమైత్ ఖాన్( Mumaith khan ) ఖయ్యూం మధ్య మంచి పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త ప్రేమగా మారిందట.ఇలా కొంతకాలం పాటు ప్రేమలో మునిగి తేలినటువంటి ఈ జంట పెళ్లి కూడా చేసుకోవాలని భావించారు.ఇక ఈ వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని భావించిన నేపథ్యంలో వీరి ప్రేమ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో ఈ పెళ్లికి అలీ కుటుంబం నుంచి ఏ మాత్రం అంగీకారం రాలేదట వీరి పెళ్లికి అభ్యంతరం తెలియచేయడంతో తప్పనిసరి పరిస్థితులలో వీరిద్దరి ప్రేమకు బ్రేకప్ చెప్పుకున్నారు.అనంతరం ఖయ్యూం మరొక అమ్మాయితో పెళ్లి చేసుకుని జీవితంలో సంతోషంగా ఉన్నారు.
ఇక ఆయనతో బ్రేకప్ చెప్పుకున్న తర్వాత ముమైత్ ఖాన్ సినీ కెరియర్ పై ఫోకస్ పెట్టలేకపోయారు.

ఇలాంటి సమయంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో డ్రగ్స్ కేస్ పెద్ద ఎత్తున కలకలం రేపింది.ఈ కేసులో భాగంగా ఈమె కూడా ఆరోపణలు ఎదుర్కొన్నారు.ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో ఈ కేసు ముగిసినప్పటికీ ఈమెకు మాత్రం అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయని చెప్పాలి.
ఇలా ముమైత్ ఖాన్ కు ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గిపోయినప్పటికీ తిరిగి అవకాశాలు పొందడం కోసం ప్రయత్నాలు చేశారు.ఇందులో భాగంగానే బిగ్ బాస్ కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు.
బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొన్నప్పటికీ ఈమెకు అనుకున్నంత స్థాయిలో ఆదరణ రాలేదని దీంతో అవకాశాలు కూడా పొందలేక ఇండస్ట్రీకి దూరమయ్యారని తెలుస్తుంది.







