మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్యను బీఆర్ఎస్ నేతలు కలవనున్నారు.ఈ మేరకు మంత్రి కేటీఆర్ మరి కాసేపటిలో పొన్నాల నివాసానికి వెళ్లనున్నారు.
అయితే పొన్నాల తాజాగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే పొన్నాలను కలవనున్న కేటీఆర్ ఆయనను బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించే అవకాశం ఉందని తెలుస్తోంది.
కాగా పొన్నాల తన రాజీనామా లేఖలో కాంగ్రెస్ పార్టీ బీసీలకు అన్యాయం చేస్తుందని పేర్కొన్నారు.ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీ బీసీలకు ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు.
ఈ నేపథ్యంలో పొన్నాల పరోక్ష వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరతారనే ప్రచారం ఇప్పటికే జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే.ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో కేటీఆర్ పొన్నాల నివాసానికి వెళ్తుండటం చర్చనీయాంశంగా మారింది.







