తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి 40 స్థానాల్లో అభ్యర్థులే లేరని మంత్రి కేటీఆర్ అన్నారు.గ్రేటర్ లో 20 నుంచి 25 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరో కూడా తెలియదని పేర్కొన్నారు.
తెలంగాణ ఎన్నికల కోసం కర్ణాటక డబ్బులు వస్తున్నాయని తాము ఎప్పటి నుంచో చెప్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు.ఒక సాధారణ కాంట్రాక్టర్ ఇంట్లో రూ.42 కోట్లు ఐటీ పట్టుకుందన్న కేటీఆర్ అక్కడి నుంచి ఇప్పటికే రూ.8 కోట్లు కొడంగల్ కి చేరిపోయాయని పేర్కొన్నారు.కాంగ్రెస్ పార్టీ పాలనని తెలంగాణ ప్రజలు ఇప్పటికే తిరస్కరించారని చెప్పారు.తెలంగాణ కంటే మంచి పాలన కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడ ఇస్తున్నారో చెప్పి ఓట్లు అడగాలని తెలిపారు.
ప్రధాని ఏ రాష్ట్రానికి వెళ్తే అక్కడ పాలనని తప్పు పడతారన్నారు.ఆరోపణలు చేసిన వాళ్లతోనే మళ్లీ పొత్తులు పెట్టుకుంటారని విమర్శించారు.ప్రధానికి ఎంత అహంకారం ఉంటే ఒక గుజరాతీ అయిన పటేల్ తెలంగాణకు స్వేచ్ఛా వాయువులు ఇచ్చారంటారన్న కేటీఆర్ ఎనిమిది వేల మంది ఆత్మహత్యలు అంటారు రాహుల్ గాంధీ అని ఎద్దేవా చేశారు.రాహుల్ గాంధీ లీడర్ కాదన్న ఆయన రాసిచ్చింది చదివే లీడర్ మాత్రమేనని ఎద్దేవా చేశారు.
రానున్న ఎన్నికలు తెలంగాణ ఆత్మ గౌరవానికి ఢిల్లీ, గుజరాత్ అహంకారానికి మధ్య జరుగుతున్న పోరాటమని వెల్లడించారు.







