మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి సోహెల్( Sohel ) ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంత బిజీగా ఉన్నారు.తాజాగా మిస్టర్ ప్రెగ్నెంట్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి సోహెల్ త్వరలోనే బూట్ కట్ బాలరాజు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.
ఈ సినిమా షూటింగ్ పనులన్నింటినీ పూర్తి చేసుకోనీ త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయన బిగ్ బాస్ పల్లవి ప్రశాంత్( Pallavi Prashanth ) గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

బిగ్ బాస్ కంటెస్టెంట్ పల్లవి ప్రశాంత్ గురించి సోహెల్ మాట్లాడుతూ… పల్లవి ప్రశాంత్ పెద్దగా చదువుకోలేదు అయినప్పటికీ ఎవరి పట్ల అసభ్యంగా మాట్లాడిన సందర్భాలు లేవు.ఇతరులను అగౌరవపరిచే విధంగా మాట్లాడలేదు ఇలా బిగ్ బాస్ హౌస్ లో తన ఆట తీరు నచ్చి నేను ఒకసారి సోషల్ మీడియా( Social media )లో ఫార్మర్ అని మెసేజ్ మాత్రమే చేశాను.ఇలా ఫార్మర్ అని మెసేజ్ చేయడంతో చాలామంది నన్ను బండ బూతులు తిడుతూ మెసేజ్ చేశారు.నేను ఒక ఫ్రాడ్ అని, దొంగ ఫాల్తూ అంటూ గలీజ్ మెసేజ్ లు పెట్టారు.
ఆ క్షణం నాకు విపరీతమైనటువంటి కోపం వచ్చింది.అప్పటినుంచి నేను బిగ్ బాస్ గురించి ఎక్కడ మాట్లాడలేదని సోహెల్ తెలిపారు.

ఆ క్షణం వారు చేసిన కామెంట్లకు నేను కూడా చాలా గట్టిగా సమాధానం ఇవ్వచ్చు కానీ దాని వల్ల ఎవరికి ప్రయోజనం లేదు అందుకే నేను మౌనంగా ఉన్నానని సోహెల్ తెలిపారు.ఇక పల్లవి ప్రశాంత్ గురించి మాట్లాడుతూ నాకు వాడు ముందు నుంచి తెలుసు. నా సినిమాలు విడుదలయ్యే సమయంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను చేపడుతూ నా సినిమాల కోసం ఎంతో కష్టపడ్డారని తెలిపారు.నా రూం వద్దకు వచ్చి నిద్రపోకుండా సినిమా ప్రమోషన్ల కోసం భారీగా కష్టపడ్డారు అంటూ ఈ సందర్భంగా పల్లవి ప్రశాంత్ గురించి సోహెల్ కామెంట్స్ చేయడంతో అంటే వీరిద్దరికి ముందే చాలా పరిచయం ఉందా ఇంత పరిచయం ఉన్నప్పటికీ సోహెల్ పేరును పల్లవి ప్రశాంత్ ఎక్కడా కూడా ప్రస్తావించలేదు అంటూ కొందరు ఈయన వ్యాఖ్యలపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.