Samantha : సమంతకు ఏమైంది.. మళ్లీ అదే పరిస్థితి.. ఫోటో వైరల్!

టాలీవుడ్( Tollywood ) ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్ సమంత( Samantha ) అందరికీ బాగా పరిచయమున్న నటి అని చెప్పాలి.నటిగా ఎంత మంచి పేరు సంపాదించుకుందో వ్యక్తిగతంగా అంత హాట్ టాపిక్ గా నిలిచింది సమంత.

 Samantha Health Status Story Viral On Internet-TeluguStop.com

ఎవరి సపోర్టు లేకుండా ఇండస్ట్రీకి అడుగుపెట్టి చిన్న హీరోయిన్ హోదా నుండి స్టార్ హీరోయిన్ క్రేజ్ కు చేరుకుంది.ఏకంగా స్టార్ హీరోలతో జతకట్టి మంచి అభిమానాన్ని సంపాదించుకుంది.

తొలిసారిగా ఏ మాయ చేసావే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాగా.అప్పటినుంచి మళ్లీ వెనుకకు తిరిగి చూడకుండా వరుసగా సినిమాలు చేస్తూ వచ్చింది.

మంచి హోదాలో ఉన్న సమయంలో తన ప్రేమ వ్యవహారాలతో వార్తల్లో నిలిచింది.ఆ తర్వాత అక్కినేని వారసుడు నాగచైతన్యతో( Naga Chaitanya ) ప్రేమాయణం నడిపించి పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహం జరుపుకుంది.

Telugu Kushi, Samantha, Tollywood-Movie

ఇక పెళ్లి తర్వాత కూడా భర్త సపోర్టుతో సినిమా ఇండస్ట్రీలో కొనసాగింది.అంతేకాకుండా పలు వ్యాపారాలు కూడా ప్రారంభించింది.పెళ్లి తర్వాత నాగచైతన్య తో కలిసి పలు సినిమాలు కూడా చేసింది.అంతేకాకుండా హోస్ట్ గా కూడా చేసింది.ఇక పెళ్లయిన తర్వాత తను తన భర్తతో ఉండే విధానాన్ని చూసి చాలామంది మురిసిపోయారు.ఇద్దరు కలిసి బాగా ట్రిప్స్ కూడా ఎంజాయ్ చేశారు.

అంత సాఫీగా సాగుతున్న వారి జీవితంలో ఏం జరిగిందో తెలియదు కానీ మూడేళ్లకే విడాకులు తీసుకున్నారు.వాళ్ళు విడాకులు తీసుకోవడానికి అసలైన కారణం ఇప్పటివరకు బయటకి రాలేదు కానీ.

చాలామంది సమంత పైనే టార్గెట్ చేశారు.తనదే తప్పు అన్నట్లుగా తనపై చాలా పుకార్లు లేపారు.

అయినా కూడా వాటిని తట్టుకొని సమంత ధైర్యంగా తన కెరీర్ పరంగా ముందుకు కొనసాగింది.

Telugu Kushi, Samantha, Tollywood-Movie

విడాకుల తర్వాత పలు సినిమాలు చేసినప్పటికీ కూడా అవి సరైన సక్సెస్ అందివ్వలేకపోయాయి.అయినా కూడా వెనకడుగు వేయకుండా సినిమాలు చేస్తూనే ఉంది.ఇక కొన్ని రోజుల కిందటే తనకు మయోసైటిస్( Myositis ) అనే అరుదైన వ్యాధి సోకిందన్న సంగతి అందరికీ తెలిసిందే.

ఈ విషయాన్ని తనే స్వయంగా సోషల్ మీడియా వేదికగా తెలిపింది.చికిత్స కోసం విదేశాలలో తిరుగుతూ ఉంది.ఆ మధ్యనే ఖుషి సినిమాతో( Khushi movie ) ప్రేక్షకుల ముందుకు రాగా కొంతకాలం సినిమాలకు దూరంగా ఉండి చికిత్స తీసుకుంటుందని తెలిసింది.అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా తను ఇన్స్టాగ్రామ్ లో ఒక స్టోరీ పంచుకుంది.

అందులో తను సెలైన్ ఎక్కించుకున్నట్లు కనిపించింది.దీంతో ఆ ఫోటో చూసిన వాళ్లంతా మళ్ళీ సమంతకు ఏం జరిగింది అని ఆందోళన చెందారు.

అయితే అసలు విషయం ఏంటంటే.తను రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు ఇమ్యూనిటీ బూస్టర్ సెలైన్ ను పెట్టుకున్నట్లు తెలిసింది.

అంతేకాకుండా దాని లాభాలు కూడా వివరించింది.రక్త కణాల ఉత్పత్తి పెరుగుతుంది.

గుండె ఆరోగ్యం, కండరాల శక్తి, ఎముకల బలాన్ని పెంచుకోవచ్చు.వైరస్ లపై పోరాడే శక్తి వస్తుందని పంచుకోగా ప్రస్తుతం ఆ ఫోటో బాగా వైరల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube