ఈ మధ్య కాలంలో చాలా మంది స్టార్ హీరోల సినిమా లు రీ రిలీజ్( Re Release Movies ) అవుతున్నాయి.స్టార్ హీరోల సినిమా లు మాత్రమే కాకుండా చిన్న హీరోల సినిమా లు కూడా థియేటర్ల వద్ద సందడి చేస్తున్నాయి.
ఇటీవల 7/జీ బృందావన్ కాలనీ సినిమా( 7/G Brindavan Colony ) ను రీ రిలీజ్ చేయడం తో ఎంతటి భారీ విజయాన్ని సొంతం చేసుకుందో మనం చూశాం.అలాంటి చిన్న సినిమా లే రీ రిలీజ్ అయి భారీ వసూళ్లు సాధిస్తూ ఉంటే మెగా స్టార్ చిరంజీవి వంటి స్టార్ హీరో సూపర్ హిట్ మూవీ రీ రిలీజ్ అయితే ఏ స్థాయి లో సందడి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
చిరంజీవి నటించిన సూపర్ హిట్ సినిమా లు లెక్కలేనన్ని ఉన్నాయి.ఇప్పటికే కొన్ని సినిమా లను ఈ మధ్య కాలంలో రీ రిలీజ్ అయ్యాయి.
ఇప్పుడు మరో సూపర్ హిట్ సినిమా ను రీ రిలీజ్ చేసేందుకు గాను ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా సమాచారం అందుతోంది.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం చిరు సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ మూవీ అయిన శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమా( Shankardada MBBS ) ను రీ రిలీజ్ చేయబోతున్నారు.అందుకు సంబంధించిన టెక్నికల్ వర్క్ జరుగుతుంది అంటూ మెగా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.ఈ మధ్య కాలంలో చాలా మంది మెగా ఫ్యాన్స్ శంకర్ దాదా సినిమా ను రీ రిలీజ్ చేయాలని మేకర్స్ కి విజ్ఞప్తి చేశారట.
అందుకే మంచి సమయం చూసి రీ రిలీజ్ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.ఆకట్టుకునే కథ మరియు కథనంతో సినిమా రూపొందింది.

బాలీవుడ్ హిట్ మూవీ మున్నా భాయ్ ఎంబీబీఎస్( Munnabhai MBBS ) కి ఇది రీమేక్ అనే విషయం తెల్సిందే.ఆ సినిమా ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో అంతే విజయాన్ని ఈ సినిమా కూడా సొంతం చేసుకుంది.తెలుగు లో చిరు అభిమానులు ఈ సినిమా ను నెత్తిన పెట్టుకుని భారీ వసూళ్లు కట్టబెట్టారు.ఈ సినిమా రీ రిలీజ్ అయితే ఏ స్థాయి లో వసూళ్లు నమోదు అవుతాయో చూడాలి.







