నా కల నెరవేరింది అంటూ ఆసక్తికరమైన పోస్ట్ చేసిన ప్రభాస్....పోస్ట్ వైరల్!

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్( Prabhas ) ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.ఈ క్రమంలోని ఈయన నాగ్ అశ్విన్( Nag Aswini ) దర్శకత్వంలో కల్కి( Kalki ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

 Prabhas Interesting Post On Amitab Bachchan Birthday Special , Amithab Bachchan-TeluguStop.com

ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ పనులను జరుపుకుంటుంది.ఇకపోతే ఈ సినిమా నుంచి ఇదివరకే మనకు గ్లింప్ వీడియో విడుదల చేయగా భారీ స్థాయిలో సినిమాపై అంచనాలను పెంచేశారు.

ఇక ఈ సినిమాలో ఎంతోమంది స్టార్ సెలబ్రిటీలు కూడా బాగం అవుతున్న విషయం మనకు తెలిసిందే.నటి దీపికా పదుకొనే( Deeika padukone ) కమల్ హాసన్ అమితాబ్ బచ్చన్ వంటి స్టార్ సెలబ్రిటీలందరూ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు.

ఇక ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ ( Amitab Bachchan ) కూడా కీలక పాత్రలో నటించబోతున్నటువంటి నేపథ్యంలో నిన్న ఆయన పుట్టినరోజు సందర్భంగా సినిమా నుంచి పోస్టర్ విడుదల చేశారు.ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.గుహలో సూర్యకిరణాలు వెలుగుల మధ్య ఒళ్లంతా ముఖాన్ని గుడ్డతో కప్పుకొని చేతిలో కర్ర పట్టుకుని నిలబడి ఉన్నారు.ఈ పోస్టర్ అందరిని ఆకట్టుకుంటోంది.ఇక అమితాబ్ బచ్చన్ పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియా( Social media ) వేదికగా సెలబ్రిటీలు అందరూ కూడా తనకు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ క్రమంలోనే నటుడు ప్రభాస్ సైతం అమితాబ్ బచ్చన్ పోస్టర్ ను సోషల్ మీడియా పేదికగా షేర్ చేస్తూ.బిగ్ బి పుట్టినరోజుకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.ప్రభాస్.

అలాగే కొన్ని తరాలకు స్ఫూర్తినిచ్చిన ఒక లెజెండ్ తో కలిసి పని చేయడం నాకు దక్కిన వరం.నిజంగా కళ నెరవేయడం అంటే ఇదేనేమో అంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు సార్ అంటూ తెలిపారు.ఇలా అమితాబ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రభాస్ షేర్ చేసినటువంటి ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.ఇక ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తుంది.

దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ సినిమాగా ఈ చిత్రాన్ని అశ్వినీ దత్ నిర్మిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube