కేంద్రం కోట్లకొలదీ వెచ్చిస్తోంది దానికేనా... అందుకే సమయం ఆదా అవుతోంది!

దేశంలో నిత్యం పెరుగుతున్న జనాభాకి నిదర్శనం తాజా గణాంకాలే అని చెప్పుకోవచ్చు.అవును, నేడు అత్యధిక జనాభాలో మనం చైనా కంటే ముందున్న సంగతి అందరికీ విదితమే.

 India Major Investment In Developing Expressways Across The Country Details, Lat-TeluguStop.com

మరి అంతా జనాభా వున్నప్పుడు పట్టణాల్లో రోడ్లపై రద్దీ అదేవిధంగా వుంటుంది.ఈ క్రమంలోనే ఎక్కడ పడితే అక్కడ ట్రాఫిక్ జామ్( Traffic Jam ) జనాలను పలు ఇబ్బందులకు గురి చేస్తుంది.

ఓ గంట పయనానికి దాదాపు రెండు మూడు గంటలు పట్టే పరిస్థితి వుంటుంది.అనుగుణంగా ప్రజల సౌలభ్యం, కనెక్టివిటీని పెంచేందుకు ఎప్పటికప్పుడు దేశంలో అధునాతన మార్పులు చోటుచేసుకుంటున్నాయి.

అందులో ముఖ్యమైనది హైవేలు అని చెప్పుకోవచ్చు.

Telugu Roads, Expressways, Speed Highways, Highways, Jam-Latest News - Telugu

అవును, ప్రధాన నగరాలను కలుపుతూ ట్రాఫిక్‌ సమస్య లేకుండా వేగంగా గమ్యస్థానానికి చేరుకునేలా కేంద్రం ఇపుడు చాలా స్పీడుగా హైవేలను( Highways ) నిర్మిస్తోంది.ఈ మధ్య కాలంలో దేశవ్యాప్తంగా ఎక్స్‌ప్రెస్‌ హైవేలు వేగంగా వ్యాప్తి చెందాయి.స్పీడ్‌ లిమిట్స్‌తో కూడిన ఎక్స్‌ప్రెస్‌వేలు( Expressways ) లేదా హైవేలు నగరాలు మరియు అంతర్రాష్ట్రాల మధ్య ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తాయి.

మరీ ముఖ్యంగా ట్రాఫిక్ రద్దీని కూడా తగ్గిస్తుంది.ఎక్స్‌ప్రెస్‌వేలు రెండు ప్రాంతాలను అనుసంధానించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తూ వేగవంతమైన ప్రయాణానికి దోహదపడతాయనే విషయం అందరికీ విదితమే.

Telugu Roads, Expressways, Speed Highways, Highways, Jam-Latest News - Telugu

హైవేల అభివృద్ధి ప్రయాణికులకు అదనపు సౌలభ్యంతో పాటు హైవే చుట్టుపక్కల ప్రాంతాల్లో సామాజిక-ఆర్థిక పరిస్థితుల మెరుగుదలకు దారి తీస్తుంది.దీంతో రోడ్డుపై ఎక్కువ సేపు ఉండాల్సిన అవసరం ఉండదు.అంతేకాకుండా వాణిజ్య రవాణా సాధనకు ఈ హైవేలు చాలా దోహదపడతాయి.ఏ దేశానికైనా హైవేలు చాలా కీలకం.ఎందుకంటే ఆ దేశ ఆర్థిక వ్యవస్థను( Economy ) మెరుగుపరచడంలో దేశంలోని రహదారి మౌలిక సదుపాయాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.ఈ అవగాహన కారణంగానే దేశవ్యాప్తంగా ఎక్స్‌ప్రెస్‌వేలను తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం గత కొన్నేళ్లుగా క్రియాశీలకంగా వ్యవహరిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube