తన పెంపుడు కుక్కకి స్టార్ హీరో పేరు పెట్టిన రవితేజ..కారణం అదేనా?

ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ కి వచ్చి, మెగాస్టార్ చిరంజీవి తర్వాత కొత్త వాళ్లకు ఆదర్శంగా నిలిచే ఐకాన్ గా మాస్ మహారాజ రవితేజ కి( Raviteja ) ఎంత మంచి పేరుందో మన అందరికీ తెలిసిందే.కస్టపడి పైకి వచ్చాడు కాబట్టి, ఆ కష్టం విలువ ఏంటో తెలుసు కాబట్టి, కొత్త వాళ్ళను , టాలెంట్ ఉన్న వాళ్ళను ప్రోత్సహించడం లో ఎప్పుడూ ముందు ఉంటాడు ఆయన.

 Ravi Teja Named His Pet Dog Rocky Hero Yash Name In Kgf Movie Details, Ravi Teja-TeluguStop.com

ఇండస్ట్రీ లో ఉండే ప్రతీ టాప్ స్టార్ హీరో తో ఎంతో స్నేహంగా ఉండే రవితేజ ఇప్పుడు ఒక వివాదం లో చిక్కుకున్నాడు.ఆయన హీరో గా నటించిన ‘టైగర్ నాగేశ్వర రావు’( Tiger Nageswara Rao ) చిత్రం ఈనెల 20 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కాబోతుంది.

తెలుగు తో పాటుగా హిందీ , తమిళం ,మలయాళం మరియు కన్నడ భాషల్లో కూడా ఈ చిత్రం విడుదల అవ్వబోతుంది.ఈ సందర్భంగా వరుసగా ఆయన ఇంటర్వ్యూస్ ఇస్తున్నాడు.

అయితే రీసెంట్ ఒక ఇంటర్వ్యూ లో జరిగిన ర్యాపిడ్ ఫైర్ క్వచ్చన్స్ లో రవితేజ ని అందరి స్టార్ హీరోల గురించి ఒక వర్డ్ లో సమాధానం చెప్పండి అని యాంకర్ అడుగుతుంది.అప్పుడు రవితేజ ని యాష్( Yash ) గురించి అడగగా, అతనికి కేజీఎఫ్ లాంటి సినిమా పడడం అతను చేసుకున్న అదృష్టం అని కామెంట్ చేసాడు.

అంటే దీని అర్థం కేజీఎఫ్ చిత్రం( KGF ) అతనిని లాటరీ తగిలినట్టు తగిలిందని పరోక్షంగా కామెంట్ చేసినట్టు యాష్ ఫ్యాన్స్ కి అర్థం అయ్యింది.

Telugu Yash, Kgf, Ravi Teja, Ravitejpet, Raviteja, Raviteja Yash, Rocky, Tigerna

దీంతో సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున రవితేజ పై యాష్ అభిమానులు విరుచుకుపడుతున్నారు.యాష్ కి కేజీఎఫ్ సినిమాకి ముందు కూడా ఒక ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ ఉందని, ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజి లేకుండా సొంత కష్టం మీద సూపర్ స్టార్ స్టేటస్ ని తెచుకున్నాడని, ఓవర్ నైట్ వచ్చిన స్టార్ స్టేటస్ కాదంటూ రవితేజ ని ట్యాగ్ చేసి కామెంట్స్ చేస్తున్నారు.

Telugu Yash, Kgf, Ravi Teja, Ravitejpet, Raviteja, Raviteja Yash, Rocky, Tigerna

మరో విషయం ఏమిటంటే రవితేజ ఇంట్లో పెరిగే కుక్క పేరు ‘రాకీ’.( Rocky ) అలాగే కేజీఎఫ్ సిరీస్ లో యాష్ పేరు కూడా రాకీ, మా హీరో ఇంటి కుక్క పేరు పెట్టుకొని మీ హీరో సినిమా చేసాడు రా అంటూ రవితేజ ఫ్యాన్స్ యాష్ ఫ్యాన్స్ కి కౌంటర్ ఇస్తున్నారు.ఏది ఏమైనా రవితేజ కి లేనిపోని నెగటివిటీ పొరపాటున అంటుకుంది.

దీనికి రవితేజ సోషల్ మీడియా ద్వారా రెస్పాన్స్ ఇచ్చి క్లారిటీ ఇస్తాడా లేదా అనేది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube