కెనడా( Canada )లో విషాదం చోటు చేసుకుంది.పంజాబ్‌కు చెందిన ఓ యువకుడు ఇక్కడి టొరంటో నగరంలో గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు.
మృతుడిని హోషియార్‌పూర్‌కు చెందిన జస్వంత్ సింగ్ బజ్వా కుమారుడు కరణ్‌వీర్ సింగ్ బజ్వా (23)గా గుర్తించారు.ఆయన మరణవార్త తెలియగానే కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు.
కరణ్‌వీర్ తన చదువు కోసం నాలుగేళ్ల క్రితం కెనడా వెళ్లాడని మృతుడి బంధువు సత్పాల్ సింగ్ బజ్వా వెల్లడించారు.తన కుమారుడితో పాటు తన తమ్ముడి కొడుకులు కూడా కెనడాలోనే వున్నారని సత్పాల్ చెప్పారు.
నాలుగేళ్ల విద్యాభ్యాసం తర్వాత కరణ్‌వీర్ .పీఆర్ (శాశ్వత నివాస హోదా) కోసం పత్రాలను సమర్పించాడు.

కరణ్‌వీర్( Karanveer Singh ) రాత్రి తన గదిలో ఎప్పటిలాగే పడుకున్నాడని.కానీ ఉదయం ఎంతకీ లేవలేదని బంధువులు తెలిపారు.అతడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు డాక్టర్లు తెలిపారు.కరణ్‌వీర్ మరణవార్తను కుటుంబ సభ్యులకు తెలియజేశారు.పోస్ట్‌మార్టం అనంతరం అతని మృతదేహాన్ని భారత్‌కు తరలించనున్నారు.కరణ్‌వీర్ సింగ్ తండ్రి జస్వంత్ సింగ్( Jaswanth Singh ) పంజాబ్ పోలీస్ విజిలెన్స్ విభాగంలో పనిచేసేవారు.
అయితే 2010లో జరిగిన రోడ్డు ప్రమాదంలో జస్వంత్ ప్రాణాలు కోల్పోయాడు.దీంతో కరణ్‌వీర్, అతని సోదరి బాగోగులను బంధువులు చూసుకున్నారు.

కాగా.కొద్దిరోజుల క్రితం పంజాబ్‌కే చెందిన గగన్‌దీప్ అలియాస్ గుగ్గు.కెనడాలో అనుమానాస్పద స్థితిలో మరణించినట్లు అతని కుటుంబానికి సమాచారం అందింది.గగన్‌దీప్( Gagandeep )కు ఇప్పటికే వివాహం కాగా.అతని భార్య కూడా స్టూడెంట్ వీసాపై కెనడాకు వెళ్లింది.తన కొడుకు, కోడలిని కెనడాకు పంపించేందుకు రూ.30 లక్షలు అప్పు చేశానని బాధితుడి తండ్రి మోహన్ లాల్ కన్నీటి పర్యంతమయ్యారు.ఇప్పుడు గగన్ మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి 20,000 కెనడియన్ డాలర్లు వెచ్చించే స్థోమత తనకు లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.







