ప్రస్తుత సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఏదో ఒక విషయంలో తిరస్కారం( Rejection ) ఎదురవుతూ ఉంటుంది.అలాంటి సందర్భాలలో చాలా ఆవేదనకు గురవుతూ ఉంటారు.
అలాగే ఎంతో బాధ పడుతూ ఉంటారు.అలాంటి బాధని వెంటనే దూరం చేసుకోలేము.
కానీ జీవితాంతం ఆవేదనపడుతూ ఉండాల్సిన పని లేదు.రిజెక్షన్ వల్ల కలిగే నొప్పి నుంచి ఎలా బయటపడాలి.
ముఖ్యంగా చెప్పాలంటే జాబ్ అప్లికేషన్ రిజెక్ట్ అయింది ఒక మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం రాలేదు.ఇలా రిజెక్ట్ అవ్వడానికి చాలా అంశాలు కనిపిస్తూ ఉంటాయి.
అందుకు కారణాలు నమ్మకం లేకపోవడం కావచ్చు.నచ్చకపోయి ఉండవచ్చు.
కోపంతో తిరస్కరించి ఉండవచ్చు.తగిన అర్హత లేకపోవడం కూడా కావచ్చు.
ఇలాంటి సందర్భాలలోనే డిప్రెషన్ ( Depression )కి గురవకుండా అసలు మనం ఎందుకు రిజెక్షన్ కి గురవుతున్న మనే దాని గురించి ఆలోచించాలి.
అప్పుడు మనలో ఉన్న తప్పుల్ని సరి చేసుకునే అవకాశం మీకు కనిపిస్తుంది.జీవితంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక అంశంలో తిరస్కారానికి కచ్చితంగా గురయ్యే ఉంటారు.అది కేవలం జీవితంలో ఒక భాగం మాత్రమే అని గుర్తుపెట్టుకోవాలి.
రిజెక్షన్ ని రిజెక్ట్ చేయకూడదు దానిని అంగీకరించాలి.తిరస్కరణ ఎంత బాధించినా తిరిగి ఇతరులను బాధ పెట్టకూడదు.
తమను నిందించుకోవడం, తిట్టుకోవడం వంటివి కూడా సరికాదు.తిరిగి మామూలు మనిషి కావడానికి సమయం పట్టినా రిజెక్షన్ వల్ల కొత్త అనుభవాలు నేర్చుకోవచ్చు.
తిరస్కరణ వల్ల నిరుత్సాహానికి లోనైతే శరీరకంగా, మానసిక ఆరోగ్యం ( Mental health )పై చెడు ప్రభావం పడుతుంది.
దానిని మార్చుకోవడానికి కొత్త అంశాలపై దృష్టి పెట్టడం ఎంతో మంచిది.అప్పుడే భవిష్యత్తు పై దృష్టి పెట్టి గతాన్ని మర్చిపోతారు.ఇలాంటి అంశాలను ఎన్ని ప్రయత్నించినా బాధను మర్చిపోలేకపోతే మానసిక వైద్యులను సంప్రదిస్తే మంచిదని నిపుణులు చెబుతున్నారు.
నిరీక్షణ వల్ల మనసుకు గాయం ఏర్పడుతుంది.ఆత్మవిశ్వాసం( self confidence ) దెబ్బతింటుంది.
తిరిగి మామూలు స్థితికి రావడానికి సెల్ఫ్ లవ్ ఎంతో అవసరం అని నిపుణులు చెబుతున్నారు.అప్పుడే ముందుకు వెళ్లగలుగుతాము.
తిరస్కారం వల్ల ఎదురైనా చేదు అనుభవం భవిష్యత్తుకు ఒక గుణపాఠంగా గుర్తుపెట్టుకోవాలి.అదే రిజెక్షన్ నుంచి బయటపడడానికి ఉత్తమమైన మార్గమని నిపుణులు చెబుతున్నారు.