యూకేలోని( UK ) ఒక భారతీయ భూస్వామికి అక్కడి ప్రభుత్వం దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది.10 సంవత్సరాల పాటు ఇళ్లను అద్దెకు ఇవ్వకుండా అతనిపై బ్యాన్ విధించింది.ఎందుకంటే అతను తన అద్దెదారులకు ప్రమాదకరమైన, పేలవమైన స్థితిలో ఉన్న ఇళ్లను అద్దెకు ఇచ్చాడు.డబ్బు కోసం కక్కుర్తి పడి అద్దెదారుల భద్రత, శ్రేయస్సు గురించి పట్టించుకోకుండా అతడు ఈ పని చేస్తున్నాడు.
యూకేలో ఇది సుదీర్ఘమైన నిషేధాలలో ఒకటి, భూస్వాములు( Landlord ) తమ అద్దెదారులకు సురక్షితమైన, నివాసయోగ్యమైన జీవన పరిస్థితులను అందించడం ఎంత ముఖ్యమో ఈ ఘటన చెప్పకనే చెబుతోంది.

వివరాల్లోకి వెళ్తే.ఇంగ్లండ్‌లోని షెఫీల్డ్‌లో( Sheffield ) 55 ఏళ్ల భూస్వామి అయిన నీలేందు దాస్( Nilendu Das ) నివసిస్తున్నాడు.అతను ప్రమాదకరమైన, అసురక్షిత ఆస్తులను అద్దెకు ఇచ్చినట్లు గుర్తించిన తర్వాత యూకే ప్రభుత్వం అతడిపై చర్య తీసుకుంది.10 ఏళ్ల పాటు ఆస్తులను అద్దెకు ఇవ్వడం లేదా నిర్వహించడాన్ని నిషేధించింది.దాస్ కొన్ని ఇళ్ల చిత్రాలలో పైకప్పులలో రంధ్రాలు, బయట చెత్త కుప్పలు, పెరట్లో చెత్త కుప్పలు కనిపించాయి.
సింక్‌ల క్రింద మురికి మెస్‌లు, పైకప్పులలో రంధ్రాలు కూడా ఉన్నాయి.

షెఫీల్డ్ సిటీ కౌన్సిల్( Sheffield City Council ) దాస్‌పై నిషేధం కోసం దరఖాస్తు చేయగా అతడి పై చర్య తీసుకోవడం జరిగింది.కౌన్సిల్ హౌసింగ్ కమిటీ చైర్, కౌన్సిలర్ డగ్లస్ జాన్సన్ మాట్లాడుతూ, “బ్యాన్ దాస్ చర్యల తీవ్రతను ప్రతిబింబిస్తుంది, అద్దెదారుల భద్రతపై( Tenant Safety ) అతని నిర్లక్ష్యాన్ని గుర్తు చేస్తుంద”ని అన్నారు.నిషేధాన్ని ఉల్లంఘిస్తే, అతను జైలుకు వెళ్లవచ్చు లేదా జరిమానా చెల్లించవలసి ఉంటుంది.
షెఫీల్డ్ సిటీ కౌన్సిల్ ఈ సమస్యను తీవ్రంగా పరిగణిస్తోంది.వారు అద్దెదారులను పోకిరీ భూస్వాముల నుంచి రక్షించడానికి కృషి చేస్తున్నారు.