బాలయ్య భగవంత్ కేసరి( Bhagavanth Kesari ) రిలీజ్ కు సమయం దగ్గర పడుతోంది.65 కోట్ల రూపాయల రేంజ్ లో ఈ సినిమా థియేట్రికల్ హక్కులు అమ్ముడవగా బాలయ్యకు అనుకూలమైన ఏరియాలలో ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేస్తుందని ఫ్యాన్స్ భావిస్తుండటం గమనార్హం.బాలయ్య కొడుకు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.భగవంత్ కేసరిలో మోక్షజ్ఞ గెస్ట్ రోల్ లో కనిపించినట్టు ప్రచారం జరుగుతోంది.

అయితే వైరల్ అవుతున్న వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది.భగవంత్ కేసరి ట్రైలర్ లాంఛ్( Bhagavanth Kesari Trailer Launch) ఈవెంట్ లో గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా డాడీ శ్రీలీల నాకు హీరోయిన్ గా నటించాలి అని మోక్షజ్ఞ చెప్పారని బాలయ్య కామెంట్లు చేయగా ఆ కామెంట్లు వివాదాస్పదం అయ్యాయి.మోక్షజ్ఞ శ్రీలీల గురించి కామెంట్ చేయడం తప్పు లేదని అయితే గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా అంటూ తండ్రిని అనడం ఏంటని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
అయితే భగవంత్ కేసరి ప్రమోషన్స్ కు సంబంధించిన ఒక ఫోటోను మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.
ఈ ఫోటోలో శ్రీలీల, మోక్షజ్ఞ( Sreeleela Mokshagna ) పక్కపక్కనే కనిపించడం గమనార్హం.మోక్షజ్ఞ, శ్రీలీల కాంబినేషన్ లో రాబోయే రోజుల్లో సినిమా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.2024లో అయినా మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ పట్టాలెక్కుతుందో లేదో చూడాలి.

చిరంజీవి, నాగార్జున కొడుకులు ఇప్పటికే ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకోవడంతో పాటు సత్తా చాటుతున్నారు.బాలయ్య కొడుకు సైతం ఆ జాబితాలో చేరాలని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు.మోక్షజ్ఞ( Mokshagna ) ఒక జానర్ కే పరిమితం కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే కథలపై ఫోకస్ పెడితే బాగుంటుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.
మోక్షజ్ఞ ఫస్ట్ సినిమాకు దర్శకుడు ఎవరనే ప్రశ్నకు సైతం సమాధానం దొరకాల్సి ఉంది.







