కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి( Vijay ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.విజయదళపతి హీరోగా నటించిన తాజా చిత్రం లియో.
ఈ సినిమా అక్టోబర్ 19న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల zకానుంది.విడుదల సమయం దగ్గర పడుతుండడంతో చిత్ర బృందం ప్రమోషన్స్ ని మొదలుపెట్టారు.
ఇది ఇలా ఉంటే ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.ఆయితే తాజాగా ఈ సినిమాలో టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా అతిథి పాత్రలో కనిపించాడన్న వార్త మరోసారి తెరపైకి వచ్చింది.
ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

గతంలో కూడా లియో( Leo 0 కి రామ్ చరణ్ కి అనుబంధం ఉండబోతోంది అంటూ వార్తలు వినిపించినప్పటికీ అవన్నీ ఫేక్ అని తేలిపోయాయి.కానీ తాజాగా రాంచరణ్ పేరు మరోసారి లియో మూవీతో లింక్ అవ్వడానికి ఒక బలమైన కారణం కూడా ఉంది.ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ అమెరికాలో ప్రారంభమయ్యాయి.
అందులో ఒక టికెట్ బుకింగ్ వెబ్‌సైట్ లియో మూవీలోని నటీనటుల వివరాలు చెబుతూ.రామ్ చరణ్( Ram Charan ) పేరు కూడా రాయడం గమనార్హం.
ఈ వెబ్‌సైట్లోని సమాచారం తప్పయ్యే అవకాశం కూడా ఉన్నది.కానీ ఒకవేళ అదే కనుక నిజమైతే మాత్రం అభిమానులకు పండగనే చెప్పాలి.
దళపతి విజయ్, రామ్ చరణ్ కలిసి సిల్వర్ స్క్రీన్ పై కనిపించడం ఇటు తెలుగు, అటు తమిళ ప్రేక్షకులకు పండుగ లా ఉంటుందనడంలో సందేహం లేదు.

ఆ టికెట్ బుకింగ్ వెబ్ సైట్లో జోసెఫ్ విజయ్ పేరుతోపాటు రామ్ చరణ్, త్రిష, అనురాగ్ కశ్యప్, గౌతమ్ మేనన్, అర్జున్ సర్జా, మాథ్యూ థామస్, సంజయ్ దత్ పేర్లు ఉన్నాయి.లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో తెరకెక్కిన లియో మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగ రాయడం ఖాయం గా కనిపిస్తుంది.ఇప్పటికే ఈ సినిమా పై భారీగా అంచనాలు ఉన్నాయి.







