ఇటీవల కాలంలో కాలం మారిపోవడంతో హీరోల దర్శకుల రెమ్యూనరేషన్లు అమాంతం పెరిగిపోయాయి.కొంతమంది దర్శకులు హీరోలకు పోటీగా హీరోల కంటే ఎక్కువగానే రెమ్యూనరేషన్ ను అందుకుంటున్నారు.
అయితే ఇది వరకు దర్శకులు పారితోషికాలు తీసుకొనేవారు.కానీ ఆ తరవాత.
వాటాలు అందుకొన్నారు.ఇప్పుడు ఏకంగా ప్యాకేజీల్లోకి దిగిపోయారు.
డైరెక్టర్ అట్లీ అందుకు లేటెస్ట్ ఉదాహరణగా చెప్పవచ్చు.తాజాగా జవాన్ మూవీతో( Jawaan movie ) ప్రేక్షకులను పలకరించారు అట్లీ.
ఈ సినిమాతో సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.

కాగా ఈ మూవీ బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ ( Shahrukh Khan )రేంజ్ ను కూడా పెంచేసింది.అంతేకాకుండా షారుఖ్ ఖాన్ కెరీర్‌లోనే ఇది మర్చిపోలేని బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి.ఈ సినిమా వెయ్యి కోట్ల మైలు రాయిని అందుకొంది.
దాంతో ప్రస్తుతం అందరి దృష్టీ డైరెక్టర్ అట్లీపై పడింది. డైరెక్టర్ అట్లీతో( Director Atlee ) సినిమా చేయాలంటే ప్యాకేజీ కింద రూ.200 కోట్లు ఇవ్వాలన్నది షరతు.ఇందులో తన పారితోషికంతో సహా మిగిలిన టెక్నీషియన్లు, మిగిలిన నటీనటుల పారితోషికాలు అన్నీ ఉంటాయి.హీరో పారితోషికం మాత్రం నిర్మాతే ఇచ్చుకోవాలి.ఎంత పేరున్న టెక్నీషియన్లయినా వాళ్ల పారితోషికాలు రూ.50 కోట్ల లోపే ఉంటాయి.

హీరో మినహాయించి మిగిలిన నటీనటులవి మరో రూ.50 కోట్లు వేసుకొన్న మిగిలిన వంద కోట్లూ అట్లీ కి జమ అన్నమాట.అట్లీ ఏ టెక్నీషియన్‌ని తీసుకొంటాడన్నది పూర్తిగా తన ఇష్టం.
జవాన్‌కి సైతం అట్లీ ఇలా ప్యాకేజీనే తీసుకొన్నాడని సమాచారం.అది రూ.1000 కోట్ల సినిమా అయ్యింది.కాబట్టి ఇప్పుడు అట్లీ ఏం అడిగినా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు.
అట్లీ త్వరలోనే అల్లు అర్జున్ తో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు.దీనికి కూడా ఇలానే పారితోషికాన్ని ప్యాకేజీ రూపంలో అందుకోవడానికి స్కీమ్ రెడీ చేస్తున్నట్టు సమాచారం.
ఈ విషయంలో రాజమౌళి, ప్రశాంత్ నీల్ కంటే అట్లీ తోపు అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి.







